18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సోనియా చిరంజీవిల ఏకాంత సమావేశం వివరాలు



సోనియా: పిలవగానే ఎగేసుకొచ్చినందుకు థాంక్స్.

చిరు: ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నా..!

సోనియా: మాకంటే ఇపుడు అవసరం వచ్చింది, మీరెందుకు ఎదురుచూస్తున్నారు?.

చిరు: ఏమి చెప్పమంటారు.. పార్టీ స్టేట్ ఆఫీసుకే దిక్కులేక మేమేడుస్తుంటే, జిల్లా ఆఫీసులు, మండల ఆఫీసులు బిల్డింగులకు అద్దె బకాయిలు చెల్లించాలని ఒకటే గోల. అదీ గాక...

సోనియా: సరే సరే, మీదరిద్రం వినేంత టైం లేదు.. మాకేం కావాలో తెలుసు కదా, మీ డిమాండ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి.

చిరు: ఏముంటాయండి.. కుదిరితే సిఎం పోస్టు, వీలైతే నాలుగు క్యాబినెట్ బెర్తులు... ఇంకా..

సోనియా: ఇక ఆపుతావా.. సిఎం పోస్టు అడిగినోడికల్లా ఇవ్వడానికి అదేమ అరటిపండా.. అలా ఇచ్చేసేలా అయితే నిన్ను పిలవాల్సిన పనేముంది మాకు, జగన్ కే ఇచ్చేవాళ్ళంగా??

చిరు: అవుననుకోండి, కాకపోతే..

సోనియా: సరే సరే.. ఇంతకీ నమ్మి ఓట్లేసిన 70 లక్షల మందికి ఏంచెబుతావ్??

చిరు: అయ్యో.. అదేముందండి, మా తెలుగు రాష్ట్రంలో అదే ప్రత్యేకత. అభిమానం అనేది ఫిక్సిడ్ ఎస్సెట్. ఒక్కసారి పొందామంటే వెర్రిజనాలు మనకోసం చచ్చేదాకా ఎగబడుతూనే ఉంటారు.

సోనియా: మరి అపుడెపుడో ఈనాడులో జెండాపీకేద్దాం అన్న పతాకశీర్షిక వస్తే రెచ్చిపోయి తల్లి గొంతుని నులిపేసే కిరాతకుడిని కాను, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అభిమానుల అండదండలతో పార్టీని మరింత పటిష్టం చేస్తాం, జెండా
ఎగరేస్తాం, జెండా నిలబెడతాం అని ఏవేవో చెప్పినట్టున్నావ్..??

చిరు: (తన స్టయిల్ లో సిగ్గుపడుతూ..) అప్పుడేదో ఆవేశంలో, మీరు చూసారా మేడం, బాగా చేసానా పెర్ఫార్మన్సు..?? అయినా మా తెలుగోళ్ళు తెల్లారితే అన్నీ మరిచిపోతారు మేడం. రేపొద్దున ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వస్తే చాలు.

సోనియా: సరే సరే, బయటకు వెళ్లి అహ్మద్ పటేల్ ఇచ్చిన పేపర్లో ఏముందో అది చదివేసి ఇంటికెళ్ళు.. ఇకనుంచి ఏంచెయ్యాలో నేను చెబుతాను, ఎలా చెయ్యాలో కిరణ్ చెబుతాడు. సొంత తెలివితేటలు వాడకు.

చిరు: జీ. అవే ఉంటే ఇలా ఎందుకు తయారవుతాను. బాగా చిరాకుగా ఉన్నట్టున్నారు, మాంచి స్టెప్ ఒక్కటి వేసి ఎంటర్ టైన్ చెయ్యమంటారా..? డాన్సు బాగా చేస్తాను అని చెబుతుంటారు అంతా.

సోనియా: చెయ్యాల్సిన డాన్సులు మున్ముందు చాలానే ఉన్నాయి, ఇక మూసుకుని బయలుదేరు.

చిరు: జీ మేడం. (కాళ్ళకు ఒక దణ్ణం పెట్టి నిష్క్రమణ)



ఇవాల్టి నుంచి మన మెగాస్టార్ చిరంజీవి కొత్త సిఎం.

సిఎం అంటే, చీఫ్ మినిస్టర్ అనుకునేరు.. కాదండి 'కాంగ్రెస్ మాన్'. ఇంకా చెప్పాలంటే "చెమ్చా టు మేడం"

గమనిక: ఇది నేను రాసింది నేను కాదు. నాకు ఈమెయిలు లో వచ్చిన దాన్ని పోస్ట్ చేస్తున్నాను. కసి, కోపం, పగ, ప్రతీకారం ఇలా తిర్చుకుంటున్నాను. చిరంజీవి చేసిన నమ్మకద్రోహానికి..... ఎమన్నా తప్పు అనిపిస్తే క్షమించండి....


మీ

మోహన్