27, సెప్టెంబర్ 2009, ఆదివారం

అమ్మాయి కలలు - ఈవి రంగుల మయం గురు

బ్లాగ్మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నాగ మోహన్ రావు. మనం. నేను ఒక బ్లాగ్ తెరవాలని అని చాలరోజులుగా అనుకుంటూ వున్నాను, అలాగే తెరిచాను అందులో రెండు టాపిక్స్ పోస్ట్ చేశాను. అయితే ఈమద్య "ప్రణీత స్వాతి గారి స్నిగ్ధకౌముది" బ్లాగ్ చదివాను, అప్పుడు నాకు అనిపించింది మనం ఎంతో ఆలోచించి మన బ్లాగ్ కి పేరు పెడుతున్నాము, తల్లిదండ్రులూ పిల్లలికి పేరు పట్టినట్లుగా, ఆ పేరు మనం ఎందుకు పెట్టామో అందరికి తెలిస్తే బాగుంటుంది కదా, అందుకే నేను న బ్లాగ్ కి "అమ్మాయి కలలు - ఈవి రంగుల మయం గురు" అని ఎందుకు పెట్టానో, మీకు తెలియాలి అని నేను ఈ పోస్ట్ రాస్తున్నాను. ఏవన్నా తప్పులు వుంటే క్షమించండి, ఇది నా మొదట పోస్ట్.

అది 1998, నవంబర్ .......
నేను ఇంటర్ 2ed ఇయర్ చదువుతున్నాను. అప్పుడు సమయం మద్యాన్నం 3 గంటలు, ఎక్కడ మా సంస్కృతం తరగతి జరుగుతుంది. ఎక్కడో చివర బల్ల మిద కూర్చొనివున్నాను నేను, మా మాస్టారు కశినాయుడు గారు మాకు అ రోజు "చారుదత్త చేరితం" పాఠం చెపుతున్నారు. అందులో పాత్రలూ నాకు ఇప్పుడు గుర్తులేవు కానీ, అది ఒక ప్రేమ కద, అయన చాల సరదాగా పాఠం చెపుతున్నారు. మేము అంత కన్నా సరదాగా వింటున్నాం. అప్పుడు అయన ఒక అమ్మాయిని "ఇంతి" అంటే ఏంటమ్మా. అని అడిగారు. అ అమ్మాయికే కాదు మాకు ఎవ్వరికి కూడా తెలియదు దాని అర్ధం. అందరం తెల్ల మోఖాలు వేసుకొని మా మాస్టారు గారిని చూస్తున్నాం. ఇంతలో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. మా లెక్కల మాస్టారు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు, మా సంస్కృతం మాస్టారు గారు దానికి అర్ధం కనుక్కొని రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.

తరువాత చూడాలి నా తిప్పలు. నేను దిని గురించి ఆలోచిస్తున్న మా లెక్కలు మాస్టారు క్లాసు లో అది అయన కనిపెట్టి తరువాత నా పనిపట్టారు బల్ల మిద నిలబెట్టి. ఏదో అ రోజు అలా కాలేజీ అయిపొయింది అనిపించి ఏంటికి వచ్చి మా నాన్నగారిని అడిగాను, "ఇంతి" అంటే అర్ధం ఏంటి అని. పాపం ఆయనకు ఎలా తెలుస్తూంది అయన లెక్కల మాస్టారు, సంస్కృతం గురించి ఆయనకి ఎలా తెలుస్తూంది. ఆరోజు మా ఇంటిలో వాళ్ళ అందరిని మా పక్క ఇళ్ళలో వున్నా తాతయ్యలు, బామ్మలు, చినాన్నాలు, పేదనాన్నాలు , పెద్దామ్మలు, పిన్నిలు, అందరి బుర్రలు తిన్నాను ఒక రెండు గంటలు. ఎవ్వరు చెప్పలేదు. అది తెలిస్తే కానీ నాకు నిద్రపట్టదు.

మర్నాడు మా సంస్కృతం క్లాసు లో మా మాస్టారు గారు అడిగారు, ఎవరికీ అయిన అర్ధం తెలిసిందా అని. అందరం అలాతెల్ల మోఖాలు వేసుకొని చూస్తూ కూర్చున్నాం. అప్పుడు చెప్పారు "ఇంతి" అంటే అర్ధం "పెళ్లి కానీ అమ్మాయి" అని. నాకు ఎందుకో "ఇంతి" అనే పదం తెగ నచేసింది అప్పుడు. అందుకే వెంటనే రాసుకున్న పుస్తకం మిద.

ఇంటర్ అయిపొయింది, డిగ్రీ కి వచ్చాను, నాలో వున్నా కవి పడగ విప్పాడు(నా పేరు నాగ మోహన్ కద అందుకే). అప్పుడు నా కలం కి ఒక పెరుపెట్టాలి అని పించింది. ఈ పేరు పెడదామా అని నేను కూడా అప్పుడు "ప్రణీత స్వాతి" గారిలాగా కూర్చున్నా, నిల్చున్నా, ఏ పనిలో వున్నా అదే ధ్యాస, నా కలం పేరు కోసం, మా కళాశాల గ్రంధాలయం లో కూర్చొని ఎన్నో పుస్తకాలూ చదివి అందులో నుంచి ఎన్నో పేర్లు నా నోట్స్ లో రాసుకున్నాను. అప్పుడు బాగానే అనిపించేది, తరువాత మల్లి చూసుకుంటే ఎందుకో నచేది కాదు. ఎలా ఒక సంవత్సరము అయిపొయింది. ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నా ఇంటర్ బుక్స్ కనబడ్డాయి. అప్పుడు గుర్తుకు వచ్చింది "ఇంతి" అనే పదం ఇంక అదే నా కలం పేరుగా పెట్టేసుకున్నాను.

నా డిగ్రీ అయిపొయింది, తరువాత మల్టిమీడియా కోర్సు చేశాను, ఇప్పుడు నాకు ఒక ప్రత్యేకమయిన మెయిల్ ID కావలి, అది ఎలా వుండాలి అంటే నాలాంటి ID ఇంక ఎవ్వరికి వుండకూడదు అని. కద మల్లి ముందుకు వచ్చింది నా కలం పేరులాగా, కాకా పొతే దీనికీ నా కలం పేరు అంత కష్టపడలేదు, నా భాషా పాండిత్యమ అంత వుపయోగించి నా కలం పేరు పక్కనే కలలు అని చేర్చేసాను ఇంగ్లీషులో. ఇప్పుడు నా మెయిల్ ID "inthidreams" అంటే "అమ్మాయి కలలు" అంటే మేము అంత ఉహించుకొని పనిచెయ్యాలి కాబట్టి "inthidreams" పెట్టేసాను.

ఇప్పుడు నా బ్లాగ్ కి అదే పేరు ఉపయోగించుకున్నాను. "అమ్మాయి కలలు" అవి ఎలా వుంటాయో నేను మీకు చెప్పక్కరలేదు ఇది అందరికి తెలిసిందే అందుకే "ఈవి రంగుల మయం గురు" అని ఒక చిన్న తోక తగిలించాను.

నేను ఈ పోస్ట్ రాయడానికి ప్రేరణ ఇచ్చిన "ప్రణీత స్వాతి" గారి కి ఆమె "స్నిగ్ధకౌముది" నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఈ పోస్ట్ చదివిన బ్లాగ్మిత్రులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు

1 కామెంట్‌: