12, సెప్టెంబర్ 2010, ఆదివారం

నా వినాయక చవితి సంగతులు


వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా...

హితులు, ఆప్తులు, ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు
!!
వినాయక చవితి -- నాకు ఇష్టమైన పండుగల్లో ఇది ఒకటి. అందుకు చాలా కారణాలున్నాయి , వినాయక చవితి హడావిడి 15 రోజుల ముందునుండి మొదలవుతుంది. ఎవరు ఎవరు ఎ పనులు చెయ్యాలి,  ఎలా చందాలు వాసులు చెయ్యాలి. ఎక్కడ వినాయుకుడిని పెట్టాలి. ఎంత పెద్ద విగ్రహం తేవాలి ఈసారి. ఊరిలో వున్నవాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు. వినక మండపం ఎలా అలంకారించాలి. ఇలా చాల చాల పనులు. ఇంక చందాకోసం ప్రతి  ఇంటి కి వెళ్లి అందరిని పేరు పేరున పలకరించావాచ్చు, అన్నిటి కన్నా మనం ఏంటో మన చుట్టూ ఉన్నవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇ పండుగ నాకు చాల చాల ఇష్టం.

నా చిన్నప్పుడు మా ఇంటిలో విగ్రహం పెట్టి పూజ చేసేవారు కాదు. పొద్దున్నే లేచి స్నానం చేసి 7  గంటలు కల్ల తయారు అయ్యి స్కూల్ కి ఒక పల్లం లో బియ్యం, బెల్లం, డబ్బులు, పువ్వులు, పూజ సామాగ్రి అంతా పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎ క్లాసు పిల్లలు వాళ్ళ క్లాసు లో కూర్చోవాలి. 8  గంటలకు 6 & 7 క్లాసు పిల్లలు వచ్చి మా దగ్గర వున్నవి అన్ని వేటికి అవి వేరువేరుగా సేకరించి. గ్రౌండ్ లో పెట్టిన మండపం దగ్గర పెట్టేవాళ్ళు. మా పంతులు మాస్టారు అక్కడ టేబుల్ మిద వినాయకుడి పెట్టి అన్ని తయారు చేసి మమ్మలి గ్రౌండ్ లోకి పిలిచేవారు. అందరు గ్రౌండ్ లో కూర్చున్న తరువాత మొదటగా మాచేత 

శుక్లాం బరధరం విష్ణుం
శశి వర్ణం చతుర్ భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే ..

తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

అని ఇ రెండు పద్యాలు చెప్పించి తరువాత అయన పూజ మొదలు పెట్టేవారు. ఒక గంటవరకు అందరం శ్రద్దగా పూజలో పాల్గొనేవాళ్ళం. పూజ అయిపోయిన తరువాత అందరు వరసగా వెళ్లి దేవునికి దండం పెట్టుకొని తరువాత మా పంతులు మాస్టారు దగ్గర ఆశీర్వాదం తీసుకోని, వరసగా ప్రసాదం తీసుకోని ఇంటికి వెళ్లి ఏదన్న తినేసి ఇంకా ఊరిలో ఎవరు ఎవరు ఎలాంటి విగ్రహాలు పెట్టారు. ఎ ఎ ప్రసాదాలు పెట్టారో అన్ని చూసుకొని మద్యాహ్నం వచ్చి ఇంటిలో అందరికి గొప్పగా చెప్పేవాళ్ళం. ఇంకా సాయంత్రం అయితే నిమర్జనం సందడి సరే సరి..

నేను
6 క్లాసు కి వచ్చిన దగ్గరనుండి నేను క్లాసు లీడర్. మేము అప్పుడు అందరికన్నా ముందు స్కూల్ కి వెళ్లి అన్ని అమర్చేవాళ్ళం పూజకు. ఇంకా మిగిలినదింత ఫైన ఉన్నదే. మనలో మనమాట మాకు మాత్రం అందరి కన్నా ఎక్కువ ప్రసాదం మిగిలేది. కాకపోతే నిమర్జనంమేము చేసేవాళ్ళం. 

ఒకసారి ఏమి అయింది అంటే నేను 7th క్లాసు లో వున్నప్పుడు నిమర్జనం చెయ్యడానికి వినాయకుడిని చెరువుకు తిసుకువేల్లము. అక్కడ ముందు వినాయుకుడిని నీటిలో
నిమర్జనం చేసేసాక అందరం స్నానం చేస్తున్నాం అప్పుడు నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మేము వినాయకుడిని తీసుకు వచ్చింది ఒక చెక్క బ్లాకు బోర్డ్ మీద. అది నీటిలో తేలుతుంది. పక్కన తాటి మట్టలు, పెద్ద వెదురు కర్రలు  వున్నాయి తెడ్డులా వాడటానికి. అంతే నేను ఒక వెదురు కర్ర తీసుకోని చెక్క మీదకి ఎక్కి లోనకి తోయ్యమని అడిగాను..అల కొంచం లోనికి వెళ్లి మల్లి తిరిగి వచ్చాను. ఇంకా మావాళ్ళు అంతా నేను వస్తాను అంటే నేను వస్తాను అని పోటి పడ్డారు. మొత్తం నలుగురం చేక్కమిదకి ఎక్కము. వాళ్ళు అంత తాటి మట్టలు పట్టు కొని తెడ్డులా నీటిలో వేస్తూ వుంటే నేను వెదురు కర్ర పట్టు కొని తోస్తున్నాను. ఇంతలో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచాడు. అయన ఒక్క కేక వేసేసరికి అంతే అందరు గాబరా పడి చేతిలో వున్నవి వదిలేసారు. న చేతిలో కర్ర ఒక్కటే వుంది. అక్కడ చుస్తే వాళ్ళ నాన్న మంచి కోపం మిధ వున్నాడు. వొడ్డున వున్నా మా గ్యాంగ్ అంతా తలో దిక్కున పారిపోరింది. నేను కర్రతో తోయ్యలేక పోతునాను. ఏమి చెయ్యాలో తెలియట్లేదు. కదిలితే ఎక్కడ పడిపోతమో అని భయం ఒక పక్క. అల ఒక పావుగంట వుంది పోయాము. అప్పటికి జనాలు పోగు అయ్యారు. ఇంకా ముగ్గురు చెరువులో దిగి మా చెక్కని తోసుకొని వచ్చారు. మాకు వొడ్డుకు వస్తున్నాం అన్న అనదం కన్నా మాకు జరిగే పూజ గురించి ఆలోచన ఎక్కువ అయిపొయింది. మొత్తం మిద వోడ్డికి వచ్చాం. అంతే మాకు పూజ మొదలు అయింది. ఇప్పటికి మా గ్యాంగ్ కలిసిన, వినాయక చవితి వచ్చిన అదే గుర్తుకు వస్తుంది...

ఇంకా హై స్కూల్ నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు మా విధిలో వున్నా వినాయకుడి దగ్గర కూర్చొని కధ వినడం అంతే ఇంక ఏమి లేదు. ఇంటర్ 2nd  ఇయర్ నుండి వినాయకచవితి చెయ్యడం మొదలు అయింది. ఊరిలో రెండు గెంగ్లు ఒకటి క్లాసు అంటె స్టూడెంట్స్ అంతా. రెండు మాస్ అంటె ఊరిలో పనిచేసుకునేవాళ్ళు. అ ఇయర్ నుండి వచాయి అప్పటివరకు అంతా కలిసి వుండే వాళ్ళం. వాళ్ళు ఎప్పుడు వినాయక చవితి చేస్తారు.  ఇంకా మేము వినాయక చవితి చెయ్యాలి అనుకున్నాము. అందరం కలిసి వురిమిద పడ్డం చందాలు అడగడానికి. ఎవ్వరిని చందా రాయమని అడగేవాళ్ళం కాదు. మామ/ చినాన్న/పెద్దనాన్న మీ పేరా ఇంత చందా రాస్తున్నాము ఇవ్వండి అని తీసుకునేవాళ్ళం. ఎవరు అయిన ఇవ్వక పొతే వాళ్ళని బతిమాలడం ఏమి చేసేవాళ్ళం కాదు కానీ వాళ్ళ ఇంటికి పూజ అయిపోయాక ఎక్కువ ప్రసాదం పంపేవాళ్ళం వల్లే తీసుకోని వచ్చి చందా ఇచ్చేవాళ్ళతరువాత. (ఇ ఐడియా నాదే). వినాయకుడిని 3 రోజులు ఉంచేవాళ్ళం. నిమర్జనం రోజు వుండేది అసలు అయిన పండగ మాకు ఊరిలో వాళ్ళకు. బాజాబజంత్రీలు, పులిఅటలు, నాగిని డాన్సు, బిందుల డాన్సు, కోలాటం, తప్పటగుల్లు, బాణసంచ కాల్చడం, ఇలా చాల ఉండేవి. మద్న్నం 3 గంటలకు మొదలు పెట్టి రాత్రి 9 గంటలవరకు వురేగించేవాళ్ళం. తరువాత నిమర్జనం చేసి చెరువులో ఈతలు కొట్టి ఇంటికి వచేసరికి 11  అయేది. ఇలా 4  ఇయరస్ చేసాము. ఇ 4 వినాయక చవితి వేడుకుల్లో ఎన్నో చిలిపి పనులు చేసాము. మచ్చుకి  ఒకటి.

మొదటసారి వినాయక చవితి చేసేటప్పుడు రాత్రి వినాయకుడి దగ్గర కాపలా వుండేవాళ్ళం. పడుకుంటే వినాయకుడు వెళ్ళిపోతాడు అంట. అందుకే వినాయకుడి దగ్గర కూర్చొని పేకాట అడుకోనేవాళ్ళం. అదే మొదటి రోజు 1 గంట వరకు మేలుకొని వున్నాము అందరికి నిద్ర వస్తుంది. సరే టీ పెట్టుకోవడానికి  పాలు లేవు. ఎప్పుడు ఎలారా అలోచుస్తువున్నాము. 10min  లో వస్తాను అని చెప్పి అక్కడ వున్నా చెంబు తీసుకోని వెళ్ళిపోయాను. అందరు ఏదో అనుకున్నారు. పక్కనే వున్నా ఆవుల దగరికి వెళ్లి 10min తరువాత చెంబు నిండా పాలు తీసుకోని వచ్హాను. ఇంకా చూడాలి కదా అందరికి ఒక్కసారి షాక్. ఇ టైం వీడికి పాలు ఎక్కడి నుండి వచాయ అని. పక్కన వున్నా కొట్టం లో అవులదగ్గర పితికను అని చెప్పను. తెల్లవారి చూడాలి కదా అది మా ఫ్రెండ్ వాళ్ళ ఆవు, దూడ కట్టేసి వున్నది కానీ ఆవు పాలు ఎవ్వటలేదు అని మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దునే తిట్టటం మొదలు పెట్టాడు ఆవుని. ఎలాంటి చిలిపి పనులు ఎన్నో చేశాము 4  ఇయరస్ లో. 

ఇంకా నా చివరి వినాయక చవితి నా చేతులమిద చ్వ్సింది అంటె నా BCA 3rd ఇయర్ లో చేసిందే. ఇది మాత్రం నా జీవితం లో చాలా పత్యేకం. ఎందుకు అంటె ఇంకా వినాయక చవితికి ఒక్కరోజు వున్నది అనగా ఇ రోజు అనుకున్నాము. నైట్ మెస్ కి వెళ్లి అందరికి చెప్పాము ఇలా వినాయక చవితి చేద్దాం అని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు 100 /- తక్కువ కాకుండా ఇవ్వాలి అని చెప్పాము. మరుసటి రోజు లంచ్ టైం కి అందరు ఇచ్చేసారు. అందరం తలా ఒక దగ్గరికి వెళ్లి అన్ని కొనుక్కొని వచ్చాము 7 గంటలు కల్ల. మండపం ఒక కుటీరం లా వేసాము స్టేజి మిద. మా కాలేజి అంతా మామిడి చెట్టులు మద్యలో స్టేజి. స్టేజి మిద కుటీరం.కుటీరం చుట్టూ చిన్న చిన్న కుండిల్లో అలంకరణ & పూల చెట్టులు. కుటీరం లో వినాయకుడు. ఇది అక్కడి అలంకరణ. వినాయకుడిని 5 రోజులు ఉంచాము. ఇదంతా ఒక ఎత్తు అయితే నిమర్జనం ఒక ఎత్తు, నిమర్జనం కి మినివెన్ మిద వినాయకుడు దాని వెనక 15 జీప్స్ మేము అందరం 30km దూరం లో వున్నా సముద్రం కి వెళ్ళాం నరసింహనాయుడు సినిమా లో రైల్ చేజింగ్ సీన్ లా. ఇప్పటికి మరిచి పోలేను అ వినాయక చవితి సందడిని. మల్లి నా జీవితం లో అటువంటి రోజు వస్తుందో రాదో చెప్పలేము..

నా సోది అంతా చెప్పి మీకు విసుగు పుట్టిస్తే క్షమించండి. అలాగే అక్షర దోషాలు ఎమన్నా వుంటే క్షమించండి.

3 కామెంట్‌లు:

  1. బాగుంది మీ వినాయక చవితి కథ.

    రాయడంలో టైపోలు చాలా ఉన్నాయి. కొద్దిగా శ్రద్ధ పెట్టి రాస్తే, అలవాటు మీద తగ్గిపోతాయి.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగా చెప్పారండీ.. బాగున్నాయి మీ వినాయక చవితి అనుభవాలు.. నిజముగా అవన్నీ మరపురాని జ్ఞాపకాలు..

    రిప్లయితొలగించండి