3, జులై 2011, ఆదివారం

ఈ భావానికి అర్థం? - 2

జరిగిన కథ,...
తాగిన మైకం లో మాధవ్ తన ఫ్రెండ్ సంధ్య కి ఫోన్ చేసి ఏం మాట్లాడుతాడో మరిచిపోతాడు. తెలివి లోకి వచ్చాక సంధ్య కి ఫోన్ చేసినా కూడా తను కాల్ ఆన్సర్  చేయక పోయే సరికి, చాలా నీచంగా ఫీల్ అవుతూ, సంధ్య తో తన friendship గురించి గుర్తుచేసుకుంటూ ఉంటాడు.


అది దాదాపు మూడేళ్ళ క్రిందటి మాట, అప్పటికే సాఫ్ట్ వేర్ జాబు లో జాయిన్ అయి సంవత్సరం కావొస్తోంది మాధవ్ కి. వేసవి కాలం పూర్తి కావొస్తోంది.... మృగశిర కార్తె లోకి సూర్యుడు ప్రవేశించాడన్న మాటే కానీ,.. ఇంకా రోకళ్ళు సైతం పగిలి పోయే లా ఎండ కాస్తోంది. హైదరాబాద్ లో జనం నీటి కోసం ప్రైవేటు కంపెనీ ల కాన్  ల పై ఆధార పడుతూ, వర్షా కాలం లో వర్షం పడుతుంది అన్న సంగతి దాదాపు మరిచిపోయారు.

రోజు లాగే ట్రాఫ్ఫిక్  ని అంతా ఈదుకుంటూ ఆఫీసు చేరే సరికి మాధవ్ కి 10 దాటింది. పెద్దగా పనేమీ లేక పోవడం తో ఉదయం అంతా collegues  తో మాట్లాడుతూ, మీటింగ్స్ అటెండ్ అవుతూ,.. సరదాగా గడిపి లంచ్ కి వెళ్లి వచ్చాడు. system tray  లో టైం చూస్తే 3:18 pm అవుతోంది. ఉన్న issues అన్ని fix ఐపోయాయి. code release కూడా రేపే ఉండటం తో తనకి కొత్త implementations   కూడా మొదలు పెట్టబుద్ది కావట్లేదు. ఇక చేసేది లేక, reports అన్నీ రెడీ చేసి పెట్టి, లీడ్ కి మెయిల్  చేసేసి, నెట్ లో ఏదైనా online game ఆడదామని సెర్చ్  చేయసాగాడు.

ఒక్క గేమ్ కూడా interesting ఆ అనిపించట్లేదు. ఎలా అనిపిస్తాయ్, టీం  లో కొత్త గా జాయిన్  ఐన ట్రైనీస్ కూడా అమ్మాయిలని వేసుకుని తిరుగుతూంటే, వాళ్ళ ని చూసి ఈర్ష్య గా ఫీల్ అవడం తప్పితే, తనది ఎమీ చేయలేని పరిస్థితి మరి. అందునా కొత్తగా జాయిన్ ఐన batch  లో ఉన్న కావ్య ని చూసినప్పటి నుండి ఆ ఫీలింగ్  మరీ పెరిగిపోయింది. ఆ పిల్ల ని వాళ్ళ అమ్మా, నాన్నా ఏం పెట్టి పెంచారో కానీ,.. తనని చుసిన ప్రతీ సారీ తనకి,... రాజమౌళి సినిమా స్టూడెంట్. 1 లోని పాట గుర్తుకి వస్తుంది. వెంటనే ఆత్మా రాముడు ,"ఏమెట్టి.........ఏమెట్టి, చేసాడే .... ఓ భామా..నిను ఆ బ్రహ్మ!" అంటూ గుండెల్లో ఒకటే గోల.

మరో సారి ఆ కావ్య ని చూద్దాం అనిపించి ఒక్క సారి పక్క కి తిరిగి, చైర్ లోనే కూర్చుని వెనక్కి వంగాడు. తను కూర్చునే చోటు నుండి కొంచం వెనక్కి వచ్చి చూస్తే కొత్తగా జాయిన్  ఐన ట్రైనీస్ అందరూ కడపడతారు. అందులో లక్కీ గా కావ్య తనకి ఎదురుగానే కూర్చుంటుంది. తను ఏదో పని చేసుకుంటూ ఉన్నట్టుంది కాబోలు. ఆ అందానికి, మాధవ్ తను ఉన్నది ఆఫీసు  అని కూడా మరిచిపోయి అలా చూస్తూ ఉండిపోయాడు,.. చిరాకు తో వెనక్కి ముడేసినా కూడా తన పొడవైన వెంట్రుకలు, ఆమె మెడ దగ్గరే ఆగి, చెమట తో కొద్దిగా తడిచిన తన మెడ ని మరింత అందంగా కనపడేలా చేస్తున్నాయి!.. fluorescent bulbs వెలుగు లో తన మెడ మీది చెమట కుడా, మెరుస్తూ కనపడుతుంటే, ముడివేసిన జుట్టు లో నుండి అపుడపుడు కొన్ని వెంట్రుకలు జారి, ఆకర్షనీయంగా అలంకరించుకున్న తన చెవుల పై నాట్యం చేస్తున్నాయి. చిన్నిచిన్ని కళ్ళు, ఆ పై నునుపైన చెక్కిలి, సన్న ని ముక్కు, అక్కడి నుండి పెదాల దగ్గరకి వెళ్ళే దారి లో గర్వంగా కనపడుతున్న బ్యూటీ స్పాట్, ఓహ్ అందాలన్నీ ఏరి కోరి ఓ బొమ్మ పై అతికినట్టు గా ఉన్నాయ్. "దేవుడా!.. ఇలాంటి అందమైన అమ్మాయిలు ఎక్కడ పుడతారో, ఎవరితో క్లోజ్ గా ఉంటారో నాకైతే అస్సలు అర్థం కాదు!.." అనుకుంటూ పెద్దగా నిట్టూర్చి ఈ లోకం లోకి వచ్చాడు.

"ఛీ జీవితం, మహానుభావులు ఊరికనే అన్నారా? 95% of the women in this world are beautiful, remaining 5% are in my class, team, and life" అని. నేను జాబు లో జాయిన్ అయినపుడు ఇలా ఒక్క అమ్మాయి కూడా జాయిన్  అవలేదు." అని తన అదృష్టాన్ని మరో సారి తిట్టుకుని కంప్యూటర్  లో మొహం పెట్టి ఆలోచించ సాగాడు. పోనీ అన్ని లైట్  తీసుకుని ఈ అమ్మాయి కి సైట్ కోడదామంటే, తన seniority అడ్డం వస్తూంది తనకి. వ్యవహారం ఏమైనా చెడిందంటే, ఆఫీసు లో చులకన అయిపోతానేమో అని భయం. ఇంక లాభం లేదనుకుని, అన్నీ మూసుకుని, online లో ఎవరైనా కనపడతారేమో వెదుక్కుందామని, ఆర్కుట్  ఓపెన్ చేసాడు. ఒక్కరూ నచ్చట్లేదు తనకి. దానికి తోడు, online లో ఉన్న ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా respond అవట్లేదు. "అందరూ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో బిజీ గా ఉన్నట్టున్నారు, వెధవలు. ఇంకా మనతో ఎం మాట్లాడతారు? ఇంటికి వెళ్దామంటే ఇంకా బోల్డంత టైం ఉంది. ఇంకా ఈ వెదుకులాట ఎన్నాళ్ళో" అనుకుంటూ,.. కాఫీ తాగుదామనిపించి లేచాడు.

ఇంత లోనే, తన ఫోన్ మోగడం తో ఎవరా అని ఫోన్  స్క్రీన్  పై చూసుకుంటూ, కాఫెటేరియా  వైపు నడుస్తున్నాడు. స్క్రీన్  పైన శ్రీధర్ అని కనపడటం తో అప్పటి వరకు నిస్తేజంగా ఉన్న కళ్ళు ఒక్క సారిగా వెయ్యి వోల్ట్ ల కాంతి తో నిండిపోయాయి. కాఫీ ని పక్కన పడేసి, ఫోన్ ఆన్సర్ చేస్తూ lobby వైపు నడిచాడు మాధవ్. శ్రీధర్, తను ఇంజనీరింగ్ లో క్లాసు మేట్స్ బాగా క్లోజ్  ఫ్రెండ్స్. డిగ్రీ ఐపోయాక, మాధవ్ కి అక్కడే హైదరాబాద్ లోనే జాబు వచ్చింది, శ్రీధర్ కేమో ముంబై లో వచ్చింది. వృత్తి ధర్మం వారిద్దరినీ విడదీసినా, ఇంటర్నెట్  మాత్రం వారిద్దరి మధ్య దూరాన్ని ఎప్పుడూ పెరగనివ్వలేదు. ఈ సారి, శ్రీధర్ ఏమాత్రం చెప్పా పెట్టకుండా రావడం తో మాధవ్ బాగా surprising గా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు.

శ్రీధర్ కి మళ్లీ రెండు రోజుల్లో వెళ్ళాల్సి ఉండటం తో, మరుసటి రోజు సాయంత్రమే కలవాలని నిర్ణయించుకున్నారు ఇద్దరూ.. office పని అంతా up to date గా ఉండటం తో, మాధవ్ కూడా సంతోషంగా సరే అనేసి,... మళ్లీ తన cabin కి దారి తీసాడు. బహూశా, మరుసటి రోజు close friend ని కలుస్తున్నానన్న ఆనందం తో అనుకుంటా,.. అప్పటి వరకి మాధవ్ కళ్ళలో ఉన్న నీరసం ఒక్క సారిగా మాయమైపోయింది. హుషారుగా ఏదో పాట hum చేసుకుంటూ, system లో log in అయ్యాడు. అప్పటికే సాయంత్రం ఆరు దాటడం తో,.. హమ్మయ్య! దరిద్రం వదిలింది రా బాబు anukuni, అన్నీ పక్కన పడేసి, system ని lock చేసి,.. ఇంటి దారి పట్టాడు.

శ్రీధర్ కి మాధవ్ కి మధ్యన రహస్యాలు అంటూ ఏమీ ఉండవు, అమ్మాయిల విషయం దగ్గరి నుండి professional life వరకు అన్నీ మాట్లాడుకుంటారు. ఇన్నాళ్ళు ఎంత online chat చేస్తున్నా, దాదాపు సంవత్సర కాలం తరువాత కలుస్తూండటం తో రేపటి గురించే ఆలోచిస్తూ నిద్ర లోకి జారుకున్నాడు మాధవ్.
***
మధ్యాహ్నం నాలుగు దాటింది. Office room అంతా centralized a.c. ఐనా,... మాధవ్ కి మాత్రం పిచ్చి కంపరంగా ఉంది. దానికి కారణం ఒక బగ్. ఆ బగ్  ని ఈ రోజు ఉదయమే testing team report చేసింది, అది కూడా high priority issue లాగా, బహూశా release కి ఒక్క రోజే సమయముండటం వల్ల ఆ bug priority పెరిగింది అనుకుంటా!.. ఆ బగ్ కి reason ఏంటో ఎంత ఆలోచించినా మాధవ్ కి తట్టడం లేదు. నిన్న సాయంత్రం వరకి బాగా ఉన్న code కి sudden గా ఏమొచ్చిందో, ఏమో, ఉదయం test చేస్తుంటే సరిగా work అవడం లేదు. ఇప్పటికే ఎన్నో సార్లు debug చేసాడు కాని ఫలితం లేక పోయింది. ఆ bug చాలా random గా వస్తుండటం తో దాని roots కనుక్కోవడం చాల కష్టంగా మారింది తనకి. ఎవైనా పెద్ద changes చేస్తే application execution తన్నేస్తోంది. ఏం చేయాలో తెలీక తల పట్టుక్కూచున్నాడు..

పదే పదే system tray లో time వైపు చూస్తూ, అసహనం గానే code కి changes చేయసాగాడు, ఐనా కూడా same problem. ఒకవైపు సమయమేమో మించి పోతోంది....సాయంత్రం 7:30 కి శ్రీధర్ ని కలవాలి. ఇక్కడ అమీర్ పెట్  నుండి కుకట్ పల్లి వెళ్లి వాణ్ణి కలవాలి అంటే ఎంత లేదన్నా గంట పడుతుంది. ఈ బగ్ ఫినిష్ చేస్తే కాని వెళ్ళడానికి వీల్లేదు అని వాళ్ళ ప్రాజెక్ట్ లీడ్ చెప్పాడు. trail and error లో దాదాపు అన్ని combinations try చేస్తున్నాడు, కాని ఒక్కటీ work అవడం లేదు. తల రాత అంటే ఇదేనేమో అనుకుని తన అదృష్టాన్ని తిట్టుకుంటూ, చివరి ప్రయత్నంగా ఒక సారి కోడ్ లో ప్రతీ statement ని conditioned compiling లో పెట్టి మళ్ళీ project build ఇచ్చి నిస్సహాయంగా compiling window వైపు చూడసాగాడు.

దాదాపు 20 నిముషాలు పాటు ఎలాంటి error report చేయకుండా build అవుతుండటం తో,.. హమ్మయ్య! అనుకుని relaxed గా నిట్టూర్చాడు మాధవ్. zero errors తో project build అవడం తో error ని retest చేసాడు. ఫస్ట్ టైం బానే పనిచేసింది కాని,.. వరుసగా రెండు మూడు సార్లు try చేస్తే మళ్లీ తన్నేస్తోంది. ఇంక లాభం లేదనుకుని,.. ఏదైతే అది అవుతుంది అని ప్రాజెక్ట్ లీడ్ ని, బగ్ ని పిచ్చ లైట్  తీసుకుని, error fix ఐనట్టు స్టేటస్  update  చేసేసి,.. ఆ కోడ్  నే repository  లోకి commit చేసి శ్రీధర్ ని కలవడానికి బయలుదేరాడు.

ఎలాగోలా,.. ట్రాఫ్ఫిక్ ని తప్పించుకుంటూ కుకట్ పల్లి  చేరుకునే సరికి, 7:30 దాటింది. ఇంక వాడితో తిట్లు తప్పవు అనుకుంటూ వాళ్ళు ఎపుడూ కలిసి కూర్చునే ఐస్ క్రీం పర్లోర్ ముందు బైక్ పార్క్ చేసి, లోపలి కి వెళ్ళాడు. ఇద్దరు మగాళ్ళు కలిసి ఐస్ క్రీం పర్లోర్ లో కూర్చోవడం ఏంటి, ఇదేం పోయేకాలం అనుకుంటున్నారా? వాళ్ళు అలా కూర్చోడానికి ఒక కారణం ఉంది, మాధవ్ డ్రింక్ చేస్తాడు కాని, శ్రీధర్ చేయడు, అందువల్ల ఇద్దరూ ఎప్పుడు కలిసినా ఏ restaurant కో, ఏ ఐస్ క్రీం పర్లోర్ కో వెళ్తుంటారు. అప్పటికే, ఒక కార్నెర్ టేబుల్ లో శ్రీధర్ ఒక్కడే కుర్చుని ఏదో ice క్రీం తింటూ వెయిట్ చేస్తున్నాడు. ఇంక మాధవ్ ని చూసి చూడగానే.. బండ బూతులు తిట్టి,.. ఆప్యాయంగా లేచి హాగ్ చేసుకున్నాడు. కాసేపు పిచ్చా పాటి మాట్లాడుకున్నాక, వాళ్ళ టాపిక్ గర్ల్ ఫ్రెండ్స్ పైకి మళ్ళింది.

మాధవ్ కి గర్ల్ ఫ్రెండ్స్ అంటూ పెద్దగా ఎవరూ లేరు. ఎవరితో కూడా 2, 3 నెలలకి మించి close గా మాట్లాడలేడు,.. ఏదో ఒక విషయం లో గొడవ పెట్టుకుని, పక్కన పెట్టేస్తాడు. ఆ విషయం శ్రీధర్ కి కూడా తెలుసు. కాని తను మాట్లాడిన అన్ని రోజులు మాత్రం అందరి కళ్ళలో పడతాడు. ఎవరికీ తెలీకుండా relation  ని మైంటైన్ చేయడం మాధవ్ కి దాదాపు గా తెలీని పని. కాని శ్రీధర్ అలాక్కాదు, కూల్ & కాం  గా ఎలాంటి హడావిడి లేకుండా,.. అమ్మాయిలతో మాట్లాడేస్తుంటాడు. అందువలనే కాబోలు, కాలేజీ  లైఫ్  లో చాలా మంది కి మాధవ్ అంటే కొంచం bad impression ఉండేది. మాధవ్ వచ్చిందగ్గరి నుండి "ఏరా ముంబై  లో ఎవరైనా అమ్మాయిలు close అయ్యా రా?" అని ఒకటే అడిగి అడిగి చంపుతున్నాడు శ్రీధర్ ని. అపుడు చెప్పాడు తను, సంధ్య గురించి. తను చాల అందంగా ఉంటుంది అని, మంచి అమ్మాయి అని, బాగా మాట్లాడుతుంది అని, ముంబై లోనే సెటిల్ ఐన తెలుగు ఫ్యామిలీ అని చెప్పాడు. వాళ్ళింటికి కూడా చాల సార్లు వెళ్లానన్నాడు. ఏంటి రా ప్రేమా అని చావ కొట్టాడు శ్రీధర్ ని మాధవ్. "వాడు సిగ్గు పడుతూనే అలా ఏమి లేదురా మంచి ఫ్రెండ్ అంతే" అన్నాడు, అలా ఐతే మాకైన పరిచయం చేయ వచ్చు కద రా, అంత అందగత్తె అంటున్నావ్, కొంచం మా జీవితాల్లో కూడా వెలుగు నింప ర బాబూ అని అడిగాడు. దానిదేముంది రా online లో పరిచయం చేయిస్తా లే... ఏం మట్లడుకుంటావో మాట్లడుకో అని సులువుగా అనేసాడు శ్రీధర్. ఆ రోజు రాత్రి వరకి అలా నే మాట్లాడుకుంటూ బాగా టైం స్పెండ్ చేసి ఇద్దరు ఎవరి ఇంటికి వాళ్ళు బయలు దేరారు.
***
మధ్యాహ్నం రెండున్నర గంటలు కావొస్తోంది. ఎవరో పిలిచినట్టు అనిపించి కళ్ళు తెరిచి చూసాడు మాధవ్, తన రూమ్మేట్ కిరణ్ తినమంటూ లేపుతున్నాడు. ఆకలి గా లేకున్నా రాత్రి మల్లి గ్యాస్ స్టేషన్ కి వెళ్ళాల్సి ఉండటం తో, ఏదైనా కొంచం తినేసి వచ్చి పడుకుందాం అని లేచి హాల్ లోకి నడిచాడు. నిన్నటి రాత్రి తాగేసి పడేసిన బాటిల్స్, స్నాక్స్ ఇంకా హాల్ లో అలానే ఉండటం తో, గది అంతా చెడు వాసన తో నిండి పోయింది. అసలు తినే ఓపికే లేదు మాధవ్ కి. ఎక్కడా నిల్చోలేక పోతున్నాడు, కళ్ళ ముందు ఉన్న టీవీ, టేబుల్ అన్ని కదులుతూ కనిపిస్తున్నాయి తనకి. శరీరం అంతా వేడి గా అనిపిస్తుంది. నోరంతా ఇంకా చేదు గానే ఉంది, బీర్ ఫ్లవొర్ ఇంకా పోలేదు కాబోలు అనుకుని, అన్నం పెట్టుకున్నాడు కాని అస్సలు సహించట్లేదు. కాని ఏదో కొంచమైనా తినాలి లేక పొతే హాంగ్ఓవర్  పోదు అనిపించి, మజ్జిగ తో ఏదో తినేసి వెళ్లి మళ్లీ పడుకున్నాడు. నిద్ర రావడం లేదు కాని.. లేచి కూర్చునే ఓపిక లేదు. ఇంకా సంధ్య తో ఏం మాట్లాడానో అనే ఆలోచనలే చుట్టు ముడుతున్నాయ్.

మాధవ్ ని, సంధ్య తనతోమాట్లాడదేమో అన్న భయం కన్నా, తను ఎందుకు మాట్లాడట్లేదు అన్న ప్రశ్నే ఎక్కువగా చంపేస్తూంది. మాధవ్ తనని అంత లా ఇష్ట పడతాడు. . తన స్నేహాన్ని ఇలా cheap గా behave చేసి మాత్రం వదులుకోలేడు. అందుకే ఆమె ఆలోచనలు అంత గా చుట్టుముడుతున్నాయి తనని....కళ్ళు మూసినా తెరిసినా అదే ప్రశ్న మది ని తోలిచేస్తూంది... తన మౌనం కన్నా మరణమే భారంగా తోస్తూంది తనకి.
(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి