11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మీరు మెడికల్ షాపులో కొన్న మందులను సరిచూసుకోండి....అందరికీ ఉపయోగపడే సమాచారం

భారతదేశంలో కల్తీ మందులు రోగులను కాటేస్తున్నాయి. మెడికల్ షాపులు బినామీ పేర్లతోనే కొనసాగుతున్నాయి. దీంతో రోగులు జబ్బులు నయం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన రోగం తగ్గకపోగా కల్తీ మందులతో కొత్త రోగాలబారిన పడుతున్నారు. డాక్టర్లు కూడా మెడికల్ షాపుల యజమానులతో కుమ్మక్కై సరైన మందులు అందించకుండా నకిలీ మందులను అందిస్తూ రోగుల నుంచి డబ్బులు దండుకొంటున్నారు.


మీరు భారదేశ మెడికల్ షాపులో కొన్న మందుల యొక్క నాణ్యత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా( అంటే అవి కల్తీ మందులా/నకిలీ మందులా లేక నిజమైన నాణ్యత కలిగిన మందులేనా అని తెలుసుకోవడానికి).........నాణ్యత గల మందులను తయారుచేసే అన్ని ఒరిజినల్ కంపనీలూ తాము తయారుచేసిన మందు లేబుల్లపై ప్రత్యేకమైన (పై ఫోటోలో చూపినట్లు) నెంబర్లను ముద్రిస్తున్నారు. మీరు కొన్న మందుల నాణ్యత గురించి తెలుసుకోవాలంటే మీరు కొన్న మందు పై ముద్రించబడిన ప్రత్యేక నెంబర్ ను మీ మొబైల్ ఫోన్ నుండి 9901099010 కు మెసేజ్ చేయండి. వెంటనే మీరు కొన్న మందు యొక్క నాణ్యత గురించిన సమాచారం మీకు రిప్లై మెసేజ్ వస్తుంది.

ఈ విషయం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైట్లకు వెళ్ళి తెలుసుకోవచ్చు.

http://www.pharmasecure.com
http://www.9901099010.com

ఈ విషయాన్ని మీకు తెలిసున్నవారందరికీ అందజేయండి.

2 కామెంట్‌లు: