27, సెప్టెంబర్ 2012, గురువారం

జామ పండ్లు ఎక్కువగా తినండి...మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి

మనం మన ఆరోగ్యాన్ని బలపరుచుకోవటానికి ఎంతో శ్రమ పడతాం. ఏన్నో ఆరోగ్య సూత్రాలను పాటిస్తాం. అందులో ఒకటి పండ్లు తినడం. ఐతే ఏ పండు తింటే మనం ఆరోగ్యాన్ని బలపరుచుకోవచ్చో మనకు ఖచ్చితంగా తెలియదు. మనకు నచ్చిన పండునో, లేక బలానా పండు ఆరోగ్యానికి మంచిదని ఎవరో చెబితేనో, ఎక్కడో చదివితేనో ఆ పండ్లను ఎక్కువగా వాడతూ ఉంటాము.

ఇక మీదట అలా చేయ వలసిన పని లేదు. పండ్లలోనే జామ పండు మన ఆరోగ్యాన్ని బలపరచటానికి ఎక్కువగా ఉపయోగ పడుతుందని హైదరాబాద్ లోని నేషనల్ ఇన్స్ టి ట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ వారు పండ్ల మీద చేసిన పరిశోధనలో తెలిసింది.

ఎలాగంటే, మనం ఆరోగ్యంగా ఉండటానికి మనకు యాంటీ-ఆక్సిడెంట్స్ అతి ముఖ్యంగా కావలసి యున్నది. మన శరీరంలో యాంటీ-ఆక్సిడెంట్స్ ఎంత ఎక్కువగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాము.ఎందుకంటే వయసు పెరిగిన కొద్దీ మనలో ఉన్న కొన్ని జీవ కణాలు కూడా పాడవుతూ ఉంటాయి. యాంటీ-ఆక్సిడెంట్స్ ఈ జీవ కణాలు పాడైపోకుండా కాపాడతుంది. ఇంతే కాకుండా వయసుతో పాటు మనకు ఏర్పడే డీ-జెనరేటివ్ వ్యాధులనూ, క్యాన్సర్ వ్యాధినీ మరియూ ముసలితనాన్ని(Early Aging) అరికట్టడంలో సహాయపడుతుంది. కనుక ఈ యాంటీ-ఆక్సిడెంట్స్ మనకు చాలా అవసరమన్నమాట. అదీ ప్రక్రుతి ఆకారంలో దొరికితే చాలా మంచిది.




జామ పండులో యాంటీ-ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగానూ, పైనాపిల్ పండులో అతి తక్కువగానూ ఉన్నట్లు పరిశోధనలో తెలిసింది.

ఇండియన్ ప్లం, మామిడి పండు, దానిమ్మ పండు, సీతాఫలం మరియూ ఆపిల్ పండ్లలో యాంటీ-ఆక్సిడంట్స్ ఎక్కువగా ఉన్నదని పైనాపిల్,అరటి పండు, బొప్పాయి, పుచ్చకాయ మరియూ ద్రాక్ష పండ్లలో తక్కువగా ఉన్నదని తెలిపేరు.

ఖరీదైన పండ్లు ఆరోగ్యానికి మంచిదని అనుకుంటాము. కానీ తక్కువ ఖరీదు గల జామ పండు ఆరోగ్యానికి అతి మంచిదని తెలిసింది. ఈ క్రింది పట్టీలో ఏ ఏ పండ్లలో ఎంత శాతం యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది.(100 గ్రాముల పండులో ఎన్ని మిల్లిగ్రాముల యాంటీ-ఆక్సిడంట్స్ ఉన్నదో తెలుపబడింది).

జామ పండు....496.
ఇండియన్ ప్లం....330
సీతాఫలం....202
మామిడి పండు....170
దానిమ్మ పండు....135
ఆపిల్ పండు....123
ద్రాక్ష పండు... 85
బొప్పాయ పండు....50
అరటి పందు....30
ఆరెంజ్ పండు...24
పుచ్చకాయ...23
పైనాపిల్....22

కనుక ఇక మీదట మీకు పండు తినాలనిపిస్తే జామ పండుకు మొదటి చాయిస్ ఇవ్వండి. మీ ఆరోగ్యాన్ని బలపరుచుకోండి.

15, సెప్టెంబర్ 2012, శనివారం

మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచడానికి ఉపయోగపడే పండ్లు,కూరగాయలు....

మానవునిలో మెదడు జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని మీకందరికీ తెలిసే ఉంటుంది. మెదడు చెప్పినవిధంగానే మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మనం మెదడును చురుకుగా ఉంచుకున్నంతకాలం మన శరీరం చురుకుగా ఉంటుంది.వయసుతో మెదడుకు సంబంధంలేదు.

కూరగాయలు...

క్యారట్.....ఇది మనకి బీటాకరోటేన్ అనే ఎంజైం ను ఇస్తుంది.ఇందులో విటమిన్-ఏ ఎక్కువగా ఉన్నది.ఇది మన కళ్లకు మంచిది.కళ్లతో చూసేది మెదడుకు త్వరగా చేరుకుంటుంది.

టమేటో...అత్యధికమైన యాంటీ ఆక్సిడంట్స్ కలిగియున్నది.టమేటోలు మనకు విటమిన్-సి,విటమిన్-ఈ బీటాకరోటోన్ మరియూ మినరల్స్ & మాంగనీస్ ను అందిస్తుంది.

ఉల్లిపాయలు....రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్-సి ఇందులో అధికంగా ఉన్నది. అరుగుదలకు కావలసిన ఎంజైములను పెంచే మాంగనీస్,మాలిబ్ డెనం మరియూ హ్రుదయానికి కావలసిన విటమిన్లను అందిస్తుంది.

వంకాయలు...ఇది మెదడుకు కావలసిన ముఖ్యమైన ఆహారం. వంకాయ మీదున్న తొక్కులొ నాసునిన్ అనే యాంటీ-ఆక్సిడంట్ ఉన్నది. ఇది మెదడులో ఉన్న అతి సన్నని సెల్ పొరలను కాపాడుతుంది.

స్పినాచ్....శరీరం లోపల ఏర్పడే వాపులనూ, ఉత్తిడులనూ తగ్గిస్తుంది.విటమిన్-కే,మాంగనీస్, ఫోలేట్ మరియూ ఐరన్ చాలా ఎక్కువగా కలిగియున్నది.


పండ్లు...

ఏర్ర రంగు పండ్లు......ఏర్ర రంగు కలిగిన పండ్లు మరియూ కూరగాయలలో ప్రక్రుతి అందించిన వాటి రంగులలో లైకోపేన్ అనే ఎంజైము ఉన్నది. ఇది మనల్ని క్యాన్సర్ అపాయం నుండి రక్షిస్తుంది.టొమేటో,వాటర్ మెలాన్ లలో యాంటీ-ఆక్సిడన్ట్స్ ఎక్కువగా ఉన్నందున అవి మెదడును చురుకుగా ఉంచుతాయి.ఏర్ర స్ట్రాబెరీ లలు యాంతో సయానిన్స్ అనే ఎంజైం కలిగి ఉండటం వలన రక్త కనాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్త కణాలు మెదడుకు మరియూ శరీరంలోని ఇతర అవయవాలకూ కావలసిన ఆక్సిజన్ అందిస్తాయి. కనుక ఇవి దెబ్బతినకుండా ఉంటే మనం ఎప్పుడూ చురుకుగా ఉండవచ్చు.ఆపిల్,బీట్రూట్,ఎర్ర క్యాబేజీ,చెర్రీ,దానిమ్మ లాంటి ఎర్ర రంగు పండ్లను ఎక్కువగా ఉపయోగించాలి.

ఆరెంజ్ మరియూ ఎల్లో రంగు పండ్లు.....ఈ రంగు పండ్లలో కరెటోనాయడ్స్ ఎంజైం కలిగి ఉంటుంది.చిలకడ దుంపలో బీటా కరోటిన్, పంప్ కిన్స్ మరియూ క్యారట్లలో విటమిన్-ఏ,విటమిన్-సి, ఫోలిక్ యాసిడ్,విటమిన్ బి-9 ఉండటం వలన మంచి ఎనర్జీ ఇస్తూ, ఒత్తిడ్లను తగ్గిస్తాయి. నిమ్మ పండు, మామిడి,ఆరెంజ్,పపాయి,పైనాపిల్,పంప్ కిన్,మొక్కజొన్న మరియూ చిలకడ దుంపలలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి.

గ్రీన్ రంగు పండ్లు....ఈ రంగు పండ్లలో క్లోరో ఫిల్ అనే ఎంజైం అధికంగా ఉంటుంది. ల్యూటైన్ మరియూ ఫోలేట్ అనే ఎంజైములు అధికం ఉండటం వలన ఈ రంగు పండ్లు మన కళ్లకు చాలా మంచిది. గ్రీన్ ఆపిల్,బీన్స్,క్యాబేజీ,కుకుంబర్,గ్రీన్ ద్రాక్ష,స్వీట్ లైం లాంటి వాటిలో ఇవి అధికముగా ఉంటాయి.

నీలం మరియూ పర్పుల్ రంగు పండ్లలో యాంటీ-ఆక్సిడంట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి రక్త నాళాలను కాపాడతాయి.జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఎండు ద్రాక్ష, బ్లూ బెరీస్,ప్లం పండ్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి. 

తెలుపు రంగు పండ్లు....ఈ రంగు పండ్లలో అల్లిసిన్ అనే ఎంజైం ఎక్కువగా ఉండటం వలన ఈ పండ్లు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త పోటును కంట్రోల్లో ఉంచుతుంది.వీటిలో మినరల్ పొటాషియం కూడా ఎక్కువగా ఉన్నది.అరటి పండు,కాలీ ఫ్లవర్,వెల్లుల్లి,అల్లం,తెల్ల మష్రూం, ఉల్లిపాయలూ,బంగాలదుంప లలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

14, సెప్టెంబర్ 2012, శుక్రవారం

మనల్ని ఉత్సాహ పరిచే కొన్ని ఆహారాలు...ఫోటోలు

మనందరికీ బద్దకమైన మనోభావం ఉంటుంది. చాలామందికి వారు తినే ఆహారాల(జంక్ ఫుడ్) వలన వారి ఆరొగ్యం మందగించి వారి బద్దకమైన మనోభావాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. దీనికి ముఖ్య కారణాలు పోషకాహార లోపాలూ మరియూ డిప్రెషన్ వంటి మానసిక కారణాలు. డిప్రెషన్ అనేది మనం ఉత్సాహంగా లేకపోవడమే. ఇదే మనలోని ఉత్సాహాన్ని అనగద్రొక్కి బద్దకాన్ని ఎక్కువచేస్తుంది. కారణాలు ఏవైనా మనం మనలోని ఉత్సాహాన్ని పెంచుకోవాలి. మనలో ఉత్సాహాన్ని పెంచే ఆహార పధార్ధాలు ఉన్నాయని తెలిసినప్పుడు వాటిని మన ఆహారంలో చేర్చుకుంటూ మన ఆరోగ్యాన్ని పెంచుకుంటూ జీవితాన్ని ఎప్పుడూ ఉత్సాహంగా గడపాలి.

బచ్చలి కూర  మనం ఎక్కువగా వాడని ఈ బచ్చలి కూరలో మెగ్నీషియం చాలా ఉన్నది. మెగ్నీషియం ఒక ముఖ్యమైన పోషక పధార్ధం.శరీర జీవరసాయన ప్రక్రియలో మెగ్నీషియం ఉత్పత్తి అవుతుంది.ఆస్ట్రేలియాలో జరిపిన ఒక పరిశోధనలో మనలో మెగ్నీషియం తక్కువగా ఉంటే మనలో ఎక్కువగా బద్దకం చోటుచేసుకుంటుందని తెలిసింది.
డార్క్ చాక్లేట్  డార్క్ చాక్లెట్లు మెదడుకు వెళ్లే రక్త ప్రసారాన్ని ఎక్కువచేస్తుంది.దీని వలన మనలోని ఏకాగ్రత పెరుగుతుంది.ఏకాగ్రత మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. రోజుకు ఒక ఔన్స్ డార్ర్క్ చాక్లెట్ తినవచ్చు.
యోగర్ట్(పెరుగు)......దీనిలో ఎక్కువ కాల్షియం ఉన్నందువలన ఇది మనలో ఉత్సాహం పెరగటానికి కావలసిన న్యూరో ట్రాన్స్ మిటర్స్ ను ఉత్పత్తిచేస్తుంది.
అస్పార్గస్....ఇందులో ఫొలేట్ మరియూ ట్రిఫ్టోఫెన్ ఎక్కువగా ఉన్నది. ఇవి రెండూ కలసి సెరిటోనిన్ అనే ఎంజైమును ఉత్పత్తిచేస్తాయి. మనిషి ఉత్సాహంగా ఉండటానికి ముఖ్య కారణం సెరిటోనిన్. మన శరీరంలో సెరిటోనిన్ తగ్గితే మనలో ఉత్సాహం తగ్గుతుంది.
తేనె...ఇందులో కయింప్ ఫెరాల్ మరియూ క్వెర్టిసిన్ అనే ముఖ్యమైన ఎంజైములు ఉన్నాయి. ఇవి మనలో డిప్రెషన్ రాకుండా చూసుకుంటాయి.ఇంతే కాకుండా చెక్కరలగా ఇది మనకు ఎక్కువ క్యాలరీలు ఇవ్వకుండానే మనకు కావలసిన ఎనర్జీ ఇస్తుంది. మనం బరువు పెరగకుండా చేస్తుంది.
టమేటో....ఇందులో లైకోపీన్ అనే ఎంజైం ఎక్కువగా ఉన్నది. లైకోపీన్ ఒక ఆంటీ-ఆక్సిడంట్. ఇది మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. టమేటోలను ఆలివ్ నూనె తో కలిపి తింటే ఇంకా మంచిది. ఆలిఫ్ నూనె లైకోపీన్ రసాయన ప్రక్రియలో సహాయపడుతుంది.
కోడి గుడ్డు....ఇందులో జింక్, విటమిన్-బి, ఐయోడిన్, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ మరియూ ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మనలో ఉతాహాన్ని పెరగడానికి సహాయపడతాయి.
కొబ్బరి.....కొబ్బరిలో మీడియం-చైన్ ట్రైగ్లిసరైడ్లు ఉన్నాయి. ఇవి మనలోని బద్దకాన్ని పోగొట్టి మన మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది.

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

మీరు మెడికల్ షాపులో కొన్న మందులను సరిచూసుకోండి....అందరికీ ఉపయోగపడే సమాచారం

భారతదేశంలో కల్తీ మందులు రోగులను కాటేస్తున్నాయి. మెడికల్ షాపులు బినామీ పేర్లతోనే కొనసాగుతున్నాయి. దీంతో రోగులు జబ్బులు నయం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చిన రోగం తగ్గకపోగా కల్తీ మందులతో కొత్త రోగాలబారిన పడుతున్నారు. డాక్టర్లు కూడా మెడికల్ షాపుల యజమానులతో కుమ్మక్కై సరైన మందులు అందించకుండా నకిలీ మందులను అందిస్తూ రోగుల నుంచి డబ్బులు దండుకొంటున్నారు.


మీరు భారదేశ మెడికల్ షాపులో కొన్న మందుల యొక్క నాణ్యత గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా( అంటే అవి కల్తీ మందులా/నకిలీ మందులా లేక నిజమైన నాణ్యత కలిగిన మందులేనా అని తెలుసుకోవడానికి).........నాణ్యత గల మందులను తయారుచేసే అన్ని ఒరిజినల్ కంపనీలూ తాము తయారుచేసిన మందు లేబుల్లపై ప్రత్యేకమైన (పై ఫోటోలో చూపినట్లు) నెంబర్లను ముద్రిస్తున్నారు. మీరు కొన్న మందుల నాణ్యత గురించి తెలుసుకోవాలంటే మీరు కొన్న మందు పై ముద్రించబడిన ప్రత్యేక నెంబర్ ను మీ మొబైల్ ఫోన్ నుండి 9901099010 కు మెసేజ్ చేయండి. వెంటనే మీరు కొన్న మందు యొక్క నాణ్యత గురించిన సమాచారం మీకు రిప్లై మెసేజ్ వస్తుంది.

ఈ విషయం గురించి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వెబ్ సైట్లకు వెళ్ళి తెలుసుకోవచ్చు.

http://www.pharmasecure.com
http://www.9901099010.com

ఈ విషయాన్ని మీకు తెలిసున్నవారందరికీ అందజేయండి.