15, సెప్టెంబర్ 2012, శనివారం

మెదడు యొక్క చురుకుదనాన్ని పెంచడానికి ఉపయోగపడే పండ్లు,కూరగాయలు....

మానవునిలో మెదడు జ్ఞానేంద్రియాలన్నింటికి ఇది ముఖ్యమైన కేంద్రం.మెదడుకు తనంతట తానే సొంతంగా మరమ్మతులు చేసుకోగలిగే సామర్థ్యం ఉందని మీకందరికీ తెలిసే ఉంటుంది. మెదడు చెప్పినవిధంగానే మన శరీరం నడుచుకుంటుంది. కాబట్టి మనం మెదడును చురుకుగా ఉంచుకున్నంతకాలం మన శరీరం చురుకుగా ఉంటుంది.వయసుతో మెదడుకు సంబంధంలేదు.

కూరగాయలు...

క్యారట్.....ఇది మనకి బీటాకరోటేన్ అనే ఎంజైం ను ఇస్తుంది.ఇందులో విటమిన్-ఏ ఎక్కువగా ఉన్నది.ఇది మన కళ్లకు మంచిది.కళ్లతో చూసేది మెదడుకు త్వరగా చేరుకుంటుంది.

టమేటో...అత్యధికమైన యాంటీ ఆక్సిడంట్స్ కలిగియున్నది.టమేటోలు మనకు విటమిన్-సి,విటమిన్-ఈ బీటాకరోటోన్ మరియూ మినరల్స్ & మాంగనీస్ ను అందిస్తుంది.

ఉల్లిపాయలు....రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్-సి ఇందులో అధికంగా ఉన్నది. అరుగుదలకు కావలసిన ఎంజైములను పెంచే మాంగనీస్,మాలిబ్ డెనం మరియూ హ్రుదయానికి కావలసిన విటమిన్లను అందిస్తుంది.

వంకాయలు...ఇది మెదడుకు కావలసిన ముఖ్యమైన ఆహారం. వంకాయ మీదున్న తొక్కులొ నాసునిన్ అనే యాంటీ-ఆక్సిడంట్ ఉన్నది. ఇది మెదడులో ఉన్న అతి సన్నని సెల్ పొరలను కాపాడుతుంది.

స్పినాచ్....శరీరం లోపల ఏర్పడే వాపులనూ, ఉత్తిడులనూ తగ్గిస్తుంది.విటమిన్-కే,మాంగనీస్, ఫోలేట్ మరియూ ఐరన్ చాలా ఎక్కువగా కలిగియున్నది.


పండ్లు...

ఏర్ర రంగు పండ్లు......ఏర్ర రంగు కలిగిన పండ్లు మరియూ కూరగాయలలో ప్రక్రుతి అందించిన వాటి రంగులలో లైకోపేన్ అనే ఎంజైము ఉన్నది. ఇది మనల్ని క్యాన్సర్ అపాయం నుండి రక్షిస్తుంది.టొమేటో,వాటర్ మెలాన్ లలో యాంటీ-ఆక్సిడన్ట్స్ ఎక్కువగా ఉన్నందున అవి మెదడును చురుకుగా ఉంచుతాయి.ఏర్ర స్ట్రాబెరీ లలు యాంతో సయానిన్స్ అనే ఎంజైం కలిగి ఉండటం వలన రక్త కనాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రక్త కణాలు మెదడుకు మరియూ శరీరంలోని ఇతర అవయవాలకూ కావలసిన ఆక్సిజన్ అందిస్తాయి. కనుక ఇవి దెబ్బతినకుండా ఉంటే మనం ఎప్పుడూ చురుకుగా ఉండవచ్చు.ఆపిల్,బీట్రూట్,ఎర్ర క్యాబేజీ,చెర్రీ,దానిమ్మ లాంటి ఎర్ర రంగు పండ్లను ఎక్కువగా ఉపయోగించాలి.

ఆరెంజ్ మరియూ ఎల్లో రంగు పండ్లు.....ఈ రంగు పండ్లలో కరెటోనాయడ్స్ ఎంజైం కలిగి ఉంటుంది.చిలకడ దుంపలో బీటా కరోటిన్, పంప్ కిన్స్ మరియూ క్యారట్లలో విటమిన్-ఏ,విటమిన్-సి, ఫోలిక్ యాసిడ్,విటమిన్ బి-9 ఉండటం వలన మంచి ఎనర్జీ ఇస్తూ, ఒత్తిడ్లను తగ్గిస్తాయి. నిమ్మ పండు, మామిడి,ఆరెంజ్,పపాయి,పైనాపిల్,పంప్ కిన్,మొక్కజొన్న మరియూ చిలకడ దుంపలలో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి.

గ్రీన్ రంగు పండ్లు....ఈ రంగు పండ్లలో క్లోరో ఫిల్ అనే ఎంజైం అధికంగా ఉంటుంది. ల్యూటైన్ మరియూ ఫోలేట్ అనే ఎంజైములు అధికం ఉండటం వలన ఈ రంగు పండ్లు మన కళ్లకు చాలా మంచిది. గ్రీన్ ఆపిల్,బీన్స్,క్యాబేజీ,కుకుంబర్,గ్రీన్ ద్రాక్ష,స్వీట్ లైం లాంటి వాటిలో ఇవి అధికముగా ఉంటాయి.

నీలం మరియూ పర్పుల్ రంగు పండ్లలో యాంటీ-ఆక్సిడంట్స్ ఎక్కువగా ఉంటాయి.ఇవి రక్త నాళాలను కాపాడతాయి.జ్ఞాపక శక్తిని పెంచుతాయి. ఎండు ద్రాక్ష, బ్లూ బెరీస్,ప్లం పండ్లలో ఇవి ఎక్కువగా ఉంటాయి. 

తెలుపు రంగు పండ్లు....ఈ రంగు పండ్లలో అల్లిసిన్ అనే ఎంజైం ఎక్కువగా ఉండటం వలన ఈ పండ్లు కొలెస్ట్రాల్ ను తగ్గించి రక్త పోటును కంట్రోల్లో ఉంచుతుంది.వీటిలో మినరల్ పొటాషియం కూడా ఎక్కువగా ఉన్నది.అరటి పండు,కాలీ ఫ్లవర్,వెల్లుల్లి,అల్లం,తెల్ల మష్రూం, ఉల్లిపాయలూ,బంగాలదుంప లలో ఇవి ఎక్కువగా ఉంటాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి