28, జూన్ 2011, మంగళవారం

ఈ భావానికి అర్థం?

కమ్మని కలలో ఎవరినో పలవరిస్తూ... ప్రశాంతంగా నిద్రుస్తున్నతన గుండెల్లో పెను ఉత్పతాన్ని తలిపించేలా,.. నిశబ్దంగా ఉన్న తన గది లో ప్రతి ధ్వనిస్తూ,.. ఏదో శబ్దం తన చెవులని చిల్లులు పొడుస్తుంటే ఉలిక్కి పడి లేచాడు మాధవ్. ఇది అతనికి రోజు అలవాటే... తను తన జీవితం లో దేన్నైనా ద్వేషిస్తూ కూడా భరిస్తాడు అంటే అది ఇదే కాబోలు... cell phone alarm. నిద్దట్లోనే alarm ని ఆపేయడానికి శత విధాల ప్రయత్నిస్తూ, చేతి వేళ్ళ పైన పట్టు కూడా సరిగా రాక పోవడం తో ... ఆ alarm ని ఆపేయడానికి చిన్న పాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది తనకి.

ఆ ప్రయత్నం లో భుజం లో హఠాత్తుగా ప్రాణాల్ని మెలేసే లా ఏదో నొప్పి పుట్టడం తో తెలివి లోకి వచ్చి కళ్ళు తెరవ బోయాడు మాధవ్.. గది నిండా వెలుతురు పరుచు కోవడం తో,.. ఆ వెలుతురు ని చూడలేక, అలానే నొప్పి ని భరిస్తూ ఆ వెలుతురికి అడ్డంగా తన చేతి ని పెట్టుకుని కాసేపు అలాగే నిద్ర పోయాడు మాధవ్.. కొద్ది సేపటికి ఆ వెలుతురు కి కళ్ళు అలవాటు పడ్డాక లేవ డానికి పోతోంటే.. మళ్లీ భుజం నొప్పి తిరగ పెట్టడం తో, ఎందుకలా జరిగిందో అనుకుంటూ..జాగ్రత్త గా లేవ సాగాడు,.. బెడ్ పైన లేచి కుర్చుంటుండగా,.. తల అంత ఒక్క సరిగా బరువుగా అనిపించి,.. కళ్ళు తిరగడం తో తల పట్టుకుని అలానే మల్లి బెడ్ పైన పడుకుండి పోయాడు.....దానికి తోడు, వేసవి అవడం తో ఆ వేడికి గొంతంతా తడారి పోయి, దాహం వేయ సాగింది తనకి.. కాని ఉదయమే అంతా లా దాహం కలగడం ఏంటో అర్ధం కాక, ఆ తల నొప్పి తో నే మంచి నీళ్ళ కోసం వెదక సాగాడు.. అపుడు table పైన కనపడ్డ ఖాళీ beer bottles ని చూడగానే మాధవ్ కి దాదాపు కథ అంతా గుర్తుకి రాసాగింది...

రాత్రి gas station నుండి రాగానే relax అవుదామని drink చేయడం తనకి అలవాటే,.. కాని ఆ రాత్రి మాత్రం room mates తో మాటల్లో పడి,.. కొంచం ఎక్కువగా నే తాగాడు.. ఇక్కడ మాధవ్ గురించి ఒక విషయం చెప్పాలి... తను ఎపుడైనా దేన్నైనా కొంచం అని అన్నాడంటే,.. మాములు standards లో అది చాల అని అర్ధం.. అలా తన standards ప్రకారం కొంచం ఎక్కువ తీసుకోవడం తో తనకి ఎపుడు పడుకున్నాడో.. ఎలా పడుకున్నాడో కూడా మరిచిపోయాడు... ఆ మత్తు లో తిన్నగా పడుకోక పోయే సరికి,... భుజం పట్టేసి ఉంటుంది అనుకుంటూ మెల్లిగా మంచం దిగసాగాడు,.. మాధవ్...

hang over లో ఉండే సరికి,.. లేస్తూనే తల అంతా ఒక్క సరిగా తిరిగినట్టు అనిపించి పడ పొతూ,.. సాయానికి గోడ పైన చేయి వేసి,.. అస్పష్టంగా కనపడుతున్నా,.. అలానే రెస్ట్ రూం వైపు కదల బోతూ ఉంటే,.. కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపించి క్రింది కి చూసాడు... cell phones, laptops, notes... night తిని వదిలేసిన snacks,..అన్ని చిందర వందరగా పడి ఉన్నాయి... ఆ hang over effect వలన balance తప్పి పక్కన ఉన్న laptop పైన అడుగు వేయబోయి తన ని తాను తమాయించుకుని,..పక్క కి జరిగి, అక్కడ ఉన్న వస్తువలన్ని తప్పించుకుంటూ, అడుగు లో అడుగు వేసుకుంటూ రెస్ట్ రూం ని చేరుకున్నాడు... sink ని చేరేసరికి,.. ఉన్న ఓపిక అంతా నశించి పోవడం తో,.. అలా సింక్ కి అనుకుని tap పైన అలా కాసేపు తల పెట్టి పడుకుండి పోయాడు మాధవ్,... కొద్ది సేపు అయ్యాక అయ్యాక లేచి,.. బ్రష్ చేసుకోడం స్టార్ట్ చేసాడు కాని,.. చేతుల్లో ఏమాత్రం శక్తి లేదు తనకి... బ్రష్ కూడా చేయడానికి వళ్ళు సహకరించక పోవడం తో,.. ఏదో మొహం కడుక్కుని,.. nature calls ని ముగించుకుని... మళ్లీ తన బెడ్ చేరాడు...

బెడ్ పైన పడుకుని సెల్ ఫోన్ లో టైం చూసుకున్నాడు,.. అప్పటికే 11:50 am దాటింది.. అంటే తన ఫోన్ alarm గత గంట సేపటి నుండి అలా ఆపకుండా మోగుతూనే ఉంది అని అనుకుంటూ... రోజు లానే ఇండియా లో ఉండే వాళ్ళమ్మ కి ఫోన్ చేయడానికి dialed list ని ఓపెన్ చేసాడు... ఆ లిస్టు లో latest caller పేరు చూసి ఒక్క క్షణం ఆగి పోయాడు... అంతా మత్తు లో ఉన్నా కూడా ఆ పేరు చూడగానే,.. తన మనసు వంద మైళ్ళ వేగం తో ఆలోచించ సాగింది... దానికి కారణం ఆ పేరు ఒక అమ్మాయిది,... "సంధ్య". పేరు కి తగినట్టు గానే ఉంటుంది తను. ఒక్క phone conversation తోనే తనతో మళ్లీ మళ్లీ మాట్లాడాలి అన్న ఆసక్తి ని పెంచింది సంధ్య. తొలి చూపు లోనే ఒక వైపు మది లో కొంటె ఊహలని రేపుతూ, మరో వైపు ఆరాధనా భావాన్ని కలిగించే చూపు తన సొంతం..

మాధవ్ కి ఎవరి పైన పెద్దగా కంప్లైంట్స్ లేవు,.. ఎవైనా ఉన్న,.. ఆ అవేశాన్నంత అక్షర రూపం లో కాగితం పైన దాచుకుని.. నవ్వేస్తూ ఉంటాడు.. .... ఇక సంధ్య విషయానికి వస్తే,.. మాధవ్ కి ఉన్న మంచి friend,.. girl friend మాత్రం కాదు... సార్థక నమదేయురాలు తను,.... సంధ్యా సమయం లో ధవళ వర్ణం లో మెరిసే ఆకాశం ఎంత ప్రశాంతంగా ఉంటుందో.... తన మోము ని చూసినా అలానే ఉంటుంది,... కాని తను మాత్రం,.. ఆ సాయం కాలం లో పొంగే పిల్ల కలవ లా చాలా చలాకీ గా ఉంటుంది,... ఇంకా మాట్లాడ్డం మొదలు పెడితే,.. గోదావరి హోరే,.. ఒపట్టాన ఆగదు.. అందం, అమాయకత్వం, తెలివి కల గలిసిన అరుదైన అద్భుత కలయిక - తన రూపం,...మాధవ్ తన కి ఎపుడు కాల్ చేసాడా అని గుర్తు తెచుకోవడానికి ప్రయత్నిస్తూ,.. call details లో చూడసాగాడు,... ఆ కాల్ 1:58 am కి చేసినట్టు గా record అయి ఉంది,... అంటే అపుడు ఇండియా లో దాదాపు గా 12:30 pm.. తను అప్పటికే బాగా తాగేసి ఉండటం తో ఫోన్ చేసి ఏం మాట్లాడిందీ,.. ఏమన్నదీ ఏమి గుర్తు రావట్లేదు తనకి...

ఆ గందర గోళం లో చిరాకు గా mails check చేసుకుందామని,.. laptop తీసుకున్నాడు... అందులో అప్పటికే mail box open చేసి ఉండటం తో,.. రాత్రి జరిగిన విషయాలు మెల్లి మెల్లిగా గుర్తుకు రా సాగాయి తనకి... రాత్రి తను సంధ్య కి ఫోన్ చేసాక... తను busy గా ఉండటం తో online chat చేసినట్టు లీల గా గుర్తు కి రా సాగింది ,.. కాని ఆ చాట్ లో ఎం మాట్లాడింది మాత్రం ఇంకా గుర్తుకి రావట్లేదు...

ఎంత కీ తను ఏం మాట్లాడాడో పూర్తిగా తెలీక పోవడం తో,.. ఆ రోజు వాళ్ళమ్మ కి call చేయడం పక్కన పెట్టి,.. సంధ్య కి మళ్లీ call చేసాడు, మాధవ్.... సంధ్య ఎంత కీ ఫోన్ ఎత్తక పోవడం తో... ఏం చేయాలో పోలేదు..తను ఎపుడు phone chesina తప్పకుండా answer చేస్తుంది.. అలాంటిది ఆ రోజు తను ఫోన్ ఎంతకీ answer చేయక పోవడం తో తను బాగా hurt ఐంది అని అర్థమైంది తనకి...ఇక చేసేది ఏమి లేక బాగా humiliated గా ఫీల్ అవుతూ తనని apologyze అడుగుతూ mail చేసాడు... అసలు drinks తీసుకున్నాక ఎవరితో నూ మాట్లాడకూడదు అని ఎపుడు అనుకుంటాడు కాని,.. కొన్ని సార్లు control తప్పుతూ ఉంటాడు.. కాని ఈ సరి ఆ తప్పు కి పెద్ద ముల్యమే చెల్లించాల్సి రావడం తో చాల నీచంగా feel అయ్యాడు తను...
hang over వలన తన వళ్ళు కూడా అసలు సహకరించక పోవడం తో ఆ రోజు అలానే సంధ్య గురించి ఆలోచిస్తూ... బెడ్ పైన కూర్చుండి పోయాడు....
***
అది,.. 2006 సంవత్సరం... మే నెల,.. అపుడే మాధవ్ మొదటి సారి సంధ్య గురించి విన్నాడు... 

(సశేషం..)

18, ఫిబ్రవరి 2011, శుక్రవారం

సోనియా చిరంజీవిల ఏకాంత సమావేశం వివరాలు



సోనియా: పిలవగానే ఎగేసుకొచ్చినందుకు థాంక్స్.

చిరు: ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్నా..!

సోనియా: మాకంటే ఇపుడు అవసరం వచ్చింది, మీరెందుకు ఎదురుచూస్తున్నారు?.

చిరు: ఏమి చెప్పమంటారు.. పార్టీ స్టేట్ ఆఫీసుకే దిక్కులేక మేమేడుస్తుంటే, జిల్లా ఆఫీసులు, మండల ఆఫీసులు బిల్డింగులకు అద్దె బకాయిలు చెల్లించాలని ఒకటే గోల. అదీ గాక...

సోనియా: సరే సరే, మీదరిద్రం వినేంత టైం లేదు.. మాకేం కావాలో తెలుసు కదా, మీ డిమాండ్స్ ఏమన్నా ఉంటే చెప్పండి.

చిరు: ఏముంటాయండి.. కుదిరితే సిఎం పోస్టు, వీలైతే నాలుగు క్యాబినెట్ బెర్తులు... ఇంకా..

సోనియా: ఇక ఆపుతావా.. సిఎం పోస్టు అడిగినోడికల్లా ఇవ్వడానికి అదేమ అరటిపండా.. అలా ఇచ్చేసేలా అయితే నిన్ను పిలవాల్సిన పనేముంది మాకు, జగన్ కే ఇచ్చేవాళ్ళంగా??

చిరు: అవుననుకోండి, కాకపోతే..

సోనియా: సరే సరే.. ఇంతకీ నమ్మి ఓట్లేసిన 70 లక్షల మందికి ఏంచెబుతావ్??

చిరు: అయ్యో.. అదేముందండి, మా తెలుగు రాష్ట్రంలో అదే ప్రత్యేకత. అభిమానం అనేది ఫిక్సిడ్ ఎస్సెట్. ఒక్కసారి పొందామంటే వెర్రిజనాలు మనకోసం చచ్చేదాకా ఎగబడుతూనే ఉంటారు.

సోనియా: మరి అపుడెపుడో ఈనాడులో జెండాపీకేద్దాం అన్న పతాకశీర్షిక వస్తే రెచ్చిపోయి తల్లి గొంతుని నులిపేసే కిరాతకుడిని కాను, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అభిమానుల అండదండలతో పార్టీని మరింత పటిష్టం చేస్తాం, జెండా
ఎగరేస్తాం, జెండా నిలబెడతాం అని ఏవేవో చెప్పినట్టున్నావ్..??

చిరు: (తన స్టయిల్ లో సిగ్గుపడుతూ..) అప్పుడేదో ఆవేశంలో, మీరు చూసారా మేడం, బాగా చేసానా పెర్ఫార్మన్సు..?? అయినా మా తెలుగోళ్ళు తెల్లారితే అన్నీ మరిచిపోతారు మేడం. రేపొద్దున ఇంకొక బ్రేకింగ్ న్యూస్ వస్తే చాలు.

సోనియా: సరే సరే, బయటకు వెళ్లి అహ్మద్ పటేల్ ఇచ్చిన పేపర్లో ఏముందో అది చదివేసి ఇంటికెళ్ళు.. ఇకనుంచి ఏంచెయ్యాలో నేను చెబుతాను, ఎలా చెయ్యాలో కిరణ్ చెబుతాడు. సొంత తెలివితేటలు వాడకు.

చిరు: జీ. అవే ఉంటే ఇలా ఎందుకు తయారవుతాను. బాగా చిరాకుగా ఉన్నట్టున్నారు, మాంచి స్టెప్ ఒక్కటి వేసి ఎంటర్ టైన్ చెయ్యమంటారా..? డాన్సు బాగా చేస్తాను అని చెబుతుంటారు అంతా.

సోనియా: చెయ్యాల్సిన డాన్సులు మున్ముందు చాలానే ఉన్నాయి, ఇక మూసుకుని బయలుదేరు.

చిరు: జీ మేడం. (కాళ్ళకు ఒక దణ్ణం పెట్టి నిష్క్రమణ)



ఇవాల్టి నుంచి మన మెగాస్టార్ చిరంజీవి కొత్త సిఎం.

సిఎం అంటే, చీఫ్ మినిస్టర్ అనుకునేరు.. కాదండి 'కాంగ్రెస్ మాన్'. ఇంకా చెప్పాలంటే "చెమ్చా టు మేడం"

గమనిక: ఇది నేను రాసింది నేను కాదు. నాకు ఈమెయిలు లో వచ్చిన దాన్ని పోస్ట్ చేస్తున్నాను. కసి, కోపం, పగ, ప్రతీకారం ఇలా తిర్చుకుంటున్నాను. చిరంజీవి చేసిన నమ్మకద్రోహానికి..... ఎమన్నా తప్పు అనిపిస్తే క్షమించండి....


మీ

మోహన్

12, సెప్టెంబర్ 2010, ఆదివారం

నా వినాయక చవితి సంగతులు


వక్ర తుండ మహా కాయ కోటి సూర్య సమ ప్రభ
నిర్విఘ్నం కురుమే దేవా సర్వ కార్యేషు సర్వదా...

హితులు, ఆప్తులు, ఆత్మీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు
!!
వినాయక చవితి -- నాకు ఇష్టమైన పండుగల్లో ఇది ఒకటి. అందుకు చాలా కారణాలున్నాయి , వినాయక చవితి హడావిడి 15 రోజుల ముందునుండి మొదలవుతుంది. ఎవరు ఎవరు ఎ పనులు చెయ్యాలి,  ఎలా చందాలు వాసులు చెయ్యాలి. ఎక్కడ వినాయుకుడిని పెట్టాలి. ఎంత పెద్ద విగ్రహం తేవాలి ఈసారి. ఊరిలో వున్నవాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు. వినక మండపం ఎలా అలంకారించాలి. ఇలా చాల చాల పనులు. ఇంక చందాకోసం ప్రతి  ఇంటి కి వెళ్లి అందరిని పేరు పేరున పలకరించావాచ్చు, అన్నిటి కన్నా మనం ఏంటో మన చుట్టూ ఉన్నవాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇ పండుగ నాకు చాల చాల ఇష్టం.

నా చిన్నప్పుడు మా ఇంటిలో విగ్రహం పెట్టి పూజ చేసేవారు కాదు. పొద్దున్నే లేచి స్నానం చేసి 7  గంటలు కల్ల తయారు అయ్యి స్కూల్ కి ఒక పల్లం లో బియ్యం, బెల్లం, డబ్బులు, పువ్వులు, పూజ సామాగ్రి అంతా పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎ క్లాసు పిల్లలు వాళ్ళ క్లాసు లో కూర్చోవాలి. 8  గంటలకు 6 & 7 క్లాసు పిల్లలు వచ్చి మా దగ్గర వున్నవి అన్ని వేటికి అవి వేరువేరుగా సేకరించి. గ్రౌండ్ లో పెట్టిన మండపం దగ్గర పెట్టేవాళ్ళు. మా పంతులు మాస్టారు అక్కడ టేబుల్ మిద వినాయకుడి పెట్టి అన్ని తయారు చేసి మమ్మలి గ్రౌండ్ లోకి పిలిచేవారు. అందరు గ్రౌండ్ లో కూర్చున్న తరువాత మొదటగా మాచేత 

శుక్లాం బరధరం విష్ణుం
శశి వర్ణం చతుర్ భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్
సర్వ విఘ్నోప శాంతయే ..

తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసముల్
కొండొక గుజ్జురూపమును కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీతనయ! ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్!

అని ఇ రెండు పద్యాలు చెప్పించి తరువాత అయన పూజ మొదలు పెట్టేవారు. ఒక గంటవరకు అందరం శ్రద్దగా పూజలో పాల్గొనేవాళ్ళం. పూజ అయిపోయిన తరువాత అందరు వరసగా వెళ్లి దేవునికి దండం పెట్టుకొని తరువాత మా పంతులు మాస్టారు దగ్గర ఆశీర్వాదం తీసుకోని, వరసగా ప్రసాదం తీసుకోని ఇంటికి వెళ్లి ఏదన్న తినేసి ఇంకా ఊరిలో ఎవరు ఎవరు ఎలాంటి విగ్రహాలు పెట్టారు. ఎ ఎ ప్రసాదాలు పెట్టారో అన్ని చూసుకొని మద్యాహ్నం వచ్చి ఇంటిలో అందరికి గొప్పగా చెప్పేవాళ్ళం. ఇంకా సాయంత్రం అయితే నిమర్జనం సందడి సరే సరి..

నేను
6 క్లాసు కి వచ్చిన దగ్గరనుండి నేను క్లాసు లీడర్. మేము అప్పుడు అందరికన్నా ముందు స్కూల్ కి వెళ్లి అన్ని అమర్చేవాళ్ళం పూజకు. ఇంకా మిగిలినదింత ఫైన ఉన్నదే. మనలో మనమాట మాకు మాత్రం అందరి కన్నా ఎక్కువ ప్రసాదం మిగిలేది. కాకపోతే నిమర్జనంమేము చేసేవాళ్ళం. 

ఒకసారి ఏమి అయింది అంటే నేను 7th క్లాసు లో వున్నప్పుడు నిమర్జనం చెయ్యడానికి వినాయకుడిని చెరువుకు తిసుకువేల్లము. అక్కడ ముందు వినాయుకుడిని నీటిలో
నిమర్జనం చేసేసాక అందరం స్నానం చేస్తున్నాం అప్పుడు నాకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. మేము వినాయకుడిని తీసుకు వచ్చింది ఒక చెక్క బ్లాకు బోర్డ్ మీద. అది నీటిలో తేలుతుంది. పక్కన తాటి మట్టలు, పెద్ద వెదురు కర్రలు  వున్నాయి తెడ్డులా వాడటానికి. అంతే నేను ఒక వెదురు కర్ర తీసుకోని చెక్క మీదకి ఎక్కి లోనకి తోయ్యమని అడిగాను..అల కొంచం లోనికి వెళ్లి మల్లి తిరిగి వచ్చాను. ఇంకా మావాళ్ళు అంతా నేను వస్తాను అంటే నేను వస్తాను అని పోటి పడ్డారు. మొత్తం నలుగురం చేక్కమిదకి ఎక్కము. వాళ్ళు అంత తాటి మట్టలు పట్టు కొని తెడ్డులా నీటిలో వేస్తూ వుంటే నేను వెదురు కర్ర పట్టు కొని తోస్తున్నాను. ఇంతలో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న వచాడు. అయన ఒక్క కేక వేసేసరికి అంతే అందరు గాబరా పడి చేతిలో వున్నవి వదిలేసారు. న చేతిలో కర్ర ఒక్కటే వుంది. అక్కడ చుస్తే వాళ్ళ నాన్న మంచి కోపం మిధ వున్నాడు. వొడ్డున వున్నా మా గ్యాంగ్ అంతా తలో దిక్కున పారిపోరింది. నేను కర్రతో తోయ్యలేక పోతునాను. ఏమి చెయ్యాలో తెలియట్లేదు. కదిలితే ఎక్కడ పడిపోతమో అని భయం ఒక పక్క. అల ఒక పావుగంట వుంది పోయాము. అప్పటికి జనాలు పోగు అయ్యారు. ఇంకా ముగ్గురు చెరువులో దిగి మా చెక్కని తోసుకొని వచ్చారు. మాకు వొడ్డుకు వస్తున్నాం అన్న అనదం కన్నా మాకు జరిగే పూజ గురించి ఆలోచన ఎక్కువ అయిపొయింది. మొత్తం మిద వోడ్డికి వచ్చాం. అంతే మాకు పూజ మొదలు అయింది. ఇప్పటికి మా గ్యాంగ్ కలిసిన, వినాయక చవితి వచ్చిన అదే గుర్తుకు వస్తుంది...

ఇంకా హై స్కూల్ నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు మా విధిలో వున్నా వినాయకుడి దగ్గర కూర్చొని కధ వినడం అంతే ఇంక ఏమి లేదు. ఇంటర్ 2nd  ఇయర్ నుండి వినాయకచవితి చెయ్యడం మొదలు అయింది. ఊరిలో రెండు గెంగ్లు ఒకటి క్లాసు అంటె స్టూడెంట్స్ అంతా. రెండు మాస్ అంటె ఊరిలో పనిచేసుకునేవాళ్ళు. అ ఇయర్ నుండి వచాయి అప్పటివరకు అంతా కలిసి వుండే వాళ్ళం. వాళ్ళు ఎప్పుడు వినాయక చవితి చేస్తారు.  ఇంకా మేము వినాయక చవితి చెయ్యాలి అనుకున్నాము. అందరం కలిసి వురిమిద పడ్డం చందాలు అడగడానికి. ఎవ్వరిని చందా రాయమని అడగేవాళ్ళం కాదు. మామ/ చినాన్న/పెద్దనాన్న మీ పేరా ఇంత చందా రాస్తున్నాము ఇవ్వండి అని తీసుకునేవాళ్ళం. ఎవరు అయిన ఇవ్వక పొతే వాళ్ళని బతిమాలడం ఏమి చేసేవాళ్ళం కాదు కానీ వాళ్ళ ఇంటికి పూజ అయిపోయాక ఎక్కువ ప్రసాదం పంపేవాళ్ళం వల్లే తీసుకోని వచ్చి చందా ఇచ్చేవాళ్ళతరువాత. (ఇ ఐడియా నాదే). వినాయకుడిని 3 రోజులు ఉంచేవాళ్ళం. నిమర్జనం రోజు వుండేది అసలు అయిన పండగ మాకు ఊరిలో వాళ్ళకు. బాజాబజంత్రీలు, పులిఅటలు, నాగిని డాన్సు, బిందుల డాన్సు, కోలాటం, తప్పటగుల్లు, బాణసంచ కాల్చడం, ఇలా చాల ఉండేవి. మద్న్నం 3 గంటలకు మొదలు పెట్టి రాత్రి 9 గంటలవరకు వురేగించేవాళ్ళం. తరువాత నిమర్జనం చేసి చెరువులో ఈతలు కొట్టి ఇంటికి వచేసరికి 11  అయేది. ఇలా 4  ఇయరస్ చేసాము. ఇ 4 వినాయక చవితి వేడుకుల్లో ఎన్నో చిలిపి పనులు చేసాము. మచ్చుకి  ఒకటి.

మొదటసారి వినాయక చవితి చేసేటప్పుడు రాత్రి వినాయకుడి దగ్గర కాపలా వుండేవాళ్ళం. పడుకుంటే వినాయకుడు వెళ్ళిపోతాడు అంట. అందుకే వినాయకుడి దగ్గర కూర్చొని పేకాట అడుకోనేవాళ్ళం. అదే మొదటి రోజు 1 గంట వరకు మేలుకొని వున్నాము అందరికి నిద్ర వస్తుంది. సరే టీ పెట్టుకోవడానికి  పాలు లేవు. ఎప్పుడు ఎలారా అలోచుస్తువున్నాము. 10min  లో వస్తాను అని చెప్పి అక్కడ వున్నా చెంబు తీసుకోని వెళ్ళిపోయాను. అందరు ఏదో అనుకున్నారు. పక్కనే వున్నా ఆవుల దగరికి వెళ్లి 10min తరువాత చెంబు నిండా పాలు తీసుకోని వచ్హాను. ఇంకా చూడాలి కదా అందరికి ఒక్కసారి షాక్. ఇ టైం వీడికి పాలు ఎక్కడి నుండి వచాయ అని. పక్కన వున్నా కొట్టం లో అవులదగ్గర పితికను అని చెప్పను. తెల్లవారి చూడాలి కదా అది మా ఫ్రెండ్ వాళ్ళ ఆవు, దూడ కట్టేసి వున్నది కానీ ఆవు పాలు ఎవ్వటలేదు అని మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పొద్దునే తిట్టటం మొదలు పెట్టాడు ఆవుని. ఎలాంటి చిలిపి పనులు ఎన్నో చేశాము 4  ఇయరస్ లో. 

ఇంకా నా చివరి వినాయక చవితి నా చేతులమిద చ్వ్సింది అంటె నా BCA 3rd ఇయర్ లో చేసిందే. ఇది మాత్రం నా జీవితం లో చాలా పత్యేకం. ఎందుకు అంటె ఇంకా వినాయక చవితికి ఒక్కరోజు వున్నది అనగా ఇ రోజు అనుకున్నాము. నైట్ మెస్ కి వెళ్లి అందరికి చెప్పాము ఇలా వినాయక చవితి చేద్దాం అని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరు 100 /- తక్కువ కాకుండా ఇవ్వాలి అని చెప్పాము. మరుసటి రోజు లంచ్ టైం కి అందరు ఇచ్చేసారు. అందరం తలా ఒక దగ్గరికి వెళ్లి అన్ని కొనుక్కొని వచ్చాము 7 గంటలు కల్ల. మండపం ఒక కుటీరం లా వేసాము స్టేజి మిద. మా కాలేజి అంతా మామిడి చెట్టులు మద్యలో స్టేజి. స్టేజి మిద కుటీరం.కుటీరం చుట్టూ చిన్న చిన్న కుండిల్లో అలంకరణ & పూల చెట్టులు. కుటీరం లో వినాయకుడు. ఇది అక్కడి అలంకరణ. వినాయకుడిని 5 రోజులు ఉంచాము. ఇదంతా ఒక ఎత్తు అయితే నిమర్జనం ఒక ఎత్తు, నిమర్జనం కి మినివెన్ మిద వినాయకుడు దాని వెనక 15 జీప్స్ మేము అందరం 30km దూరం లో వున్నా సముద్రం కి వెళ్ళాం నరసింహనాయుడు సినిమా లో రైల్ చేజింగ్ సీన్ లా. ఇప్పటికి మరిచి పోలేను అ వినాయక చవితి సందడిని. మల్లి నా జీవితం లో అటువంటి రోజు వస్తుందో రాదో చెప్పలేము..

నా సోది అంతా చెప్పి మీకు విసుగు పుట్టిస్తే క్షమించండి. అలాగే అక్షర దోషాలు ఎమన్నా వుంటే క్షమించండి.

23, మే 2010, ఆదివారం

వేటూరి సుందరరామ మూర్తి


వేటూరి సుందరరామ మూర్తి (29 January 1936 - 22 May 2010 [aged 74])

తెలుగు అక్షర వర్ణమాల దాసోహం తన కలానికి ...
తన పాట విన్న ప్రతివాడు దాసోహం తనకి ....
తనే దాసోహం అయినాడు తెలుగు కళమ్మ తల్లికి ....
ఆ శకం శ్రీ శ్రీ ధీ అయితే ఇ శకం వేటూరిది......
అటువంటి వేటూరికి శ్రద్దాంజలి ఘటించావలిసి రావడం నిజంగా బాధాకరం .....

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడూ లేడులే
వాలిపోయే పోద్దా నీకు వర్నాలేందుకే లోకమేన్నాడో చికటాయే

వేటూరి పాట బతికున్నతకాలం వేటూరి మనతోనే వుంటారు....

మోహన్

1, మార్చి 2010, సోమవారం

హోలీ శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులు అందరికి హోలీ శుభాకాంక్షలు .

మీ మోహన్

14, అక్టోబర్ 2009, బుధవారం

ఓ నేస్తమా............

పున్నమి రోజు చంద్రుని చూడు
ఆ వెన్నెలలో నేనుంటా...
వేసవి రోజు సూర్యుని చూడు
ఆ వెలుతురులో నేనుంటా.....
వర్షపు రోజు వానను చూడు
ఆ చినుకులో నేనుంటా.......
చల్లని రోజు చలిని చూడు
ఆ మంచులో నేనుంటా.......
నీ కలలలో పరిశీలనగా చూడు
ఆ కలలో నేనుంటా......
నీ హృదయాన్ని తట్టి చూడు
ఆ హృదయంలో నేనుంటా............
ఇదంతా కాదు కాని నా స్నేహితుల హృదయాలలో నేను ఉంటా

కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...

విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...

వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం
కిరణానికి చీకటి లేదు,
సిరి మువ్వ కి మౌనం లేదు,
చిరు నవ్వు కి మరణం లేదు,
మన స్నెహానికి అంతం లేదు,
మరిచే స్నెహం చేయకు,
చేసే స్నెహం మరవకు......ఓ నేస్తమా

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

అమ్మాయి కలలు - ఈవి రంగుల మయం గురు

బ్లాగ్మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నాగ మోహన్ రావు. మనం. నేను ఒక బ్లాగ్ తెరవాలని అని చాలరోజులుగా అనుకుంటూ వున్నాను, అలాగే తెరిచాను అందులో రెండు టాపిక్స్ పోస్ట్ చేశాను. అయితే ఈమద్య "ప్రణీత స్వాతి గారి స్నిగ్ధకౌముది" బ్లాగ్ చదివాను, అప్పుడు నాకు అనిపించింది మనం ఎంతో ఆలోచించి మన బ్లాగ్ కి పేరు పెడుతున్నాము, తల్లిదండ్రులూ పిల్లలికి పేరు పట్టినట్లుగా, ఆ పేరు మనం ఎందుకు పెట్టామో అందరికి తెలిస్తే బాగుంటుంది కదా, అందుకే నేను న బ్లాగ్ కి "అమ్మాయి కలలు - ఈవి రంగుల మయం గురు" అని ఎందుకు పెట్టానో, మీకు తెలియాలి అని నేను ఈ పోస్ట్ రాస్తున్నాను. ఏవన్నా తప్పులు వుంటే క్షమించండి, ఇది నా మొదట పోస్ట్.

అది 1998, నవంబర్ .......
నేను ఇంటర్ 2ed ఇయర్ చదువుతున్నాను. అప్పుడు సమయం మద్యాన్నం 3 గంటలు, ఎక్కడ మా సంస్కృతం తరగతి జరుగుతుంది. ఎక్కడో చివర బల్ల మిద కూర్చొనివున్నాను నేను, మా మాస్టారు కశినాయుడు గారు మాకు అ రోజు "చారుదత్త చేరితం" పాఠం చెపుతున్నారు. అందులో పాత్రలూ నాకు ఇప్పుడు గుర్తులేవు కానీ, అది ఒక ప్రేమ కద, అయన చాల సరదాగా పాఠం చెపుతున్నారు. మేము అంత కన్నా సరదాగా వింటున్నాం. అప్పుడు అయన ఒక అమ్మాయిని "ఇంతి" అంటే ఏంటమ్మా. అని అడిగారు. అ అమ్మాయికే కాదు మాకు ఎవ్వరికి కూడా తెలియదు దాని అర్ధం. అందరం తెల్ల మోఖాలు వేసుకొని మా మాస్టారు గారిని చూస్తున్నాం. ఇంతలో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. మా లెక్కల మాస్టారు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డారు, మా సంస్కృతం మాస్టారు గారు దానికి అర్ధం కనుక్కొని రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.

తరువాత చూడాలి నా తిప్పలు. నేను దిని గురించి ఆలోచిస్తున్న మా లెక్కలు మాస్టారు క్లాసు లో అది అయన కనిపెట్టి తరువాత నా పనిపట్టారు బల్ల మిద నిలబెట్టి. ఏదో అ రోజు అలా కాలేజీ అయిపొయింది అనిపించి ఏంటికి వచ్చి మా నాన్నగారిని అడిగాను, "ఇంతి" అంటే అర్ధం ఏంటి అని. పాపం ఆయనకు ఎలా తెలుస్తూంది అయన లెక్కల మాస్టారు, సంస్కృతం గురించి ఆయనకి ఎలా తెలుస్తూంది. ఆరోజు మా ఇంటిలో వాళ్ళ అందరిని మా పక్క ఇళ్ళలో వున్నా తాతయ్యలు, బామ్మలు, చినాన్నాలు, పేదనాన్నాలు , పెద్దామ్మలు, పిన్నిలు, అందరి బుర్రలు తిన్నాను ఒక రెండు గంటలు. ఎవ్వరు చెప్పలేదు. అది తెలిస్తే కానీ నాకు నిద్రపట్టదు.

మర్నాడు మా సంస్కృతం క్లాసు లో మా మాస్టారు గారు అడిగారు, ఎవరికీ అయిన అర్ధం తెలిసిందా అని. అందరం అలాతెల్ల మోఖాలు వేసుకొని చూస్తూ కూర్చున్నాం. అప్పుడు చెప్పారు "ఇంతి" అంటే అర్ధం "పెళ్లి కానీ అమ్మాయి" అని. నాకు ఎందుకో "ఇంతి" అనే పదం తెగ నచేసింది అప్పుడు. అందుకే వెంటనే రాసుకున్న పుస్తకం మిద.

ఇంటర్ అయిపొయింది, డిగ్రీ కి వచ్చాను, నాలో వున్నా కవి పడగ విప్పాడు(నా పేరు నాగ మోహన్ కద అందుకే). అప్పుడు నా కలం కి ఒక పెరుపెట్టాలి అని పించింది. ఈ పేరు పెడదామా అని నేను కూడా అప్పుడు "ప్రణీత స్వాతి" గారిలాగా కూర్చున్నా, నిల్చున్నా, ఏ పనిలో వున్నా అదే ధ్యాస, నా కలం పేరు కోసం, మా కళాశాల గ్రంధాలయం లో కూర్చొని ఎన్నో పుస్తకాలూ చదివి అందులో నుంచి ఎన్నో పేర్లు నా నోట్స్ లో రాసుకున్నాను. అప్పుడు బాగానే అనిపించేది, తరువాత మల్లి చూసుకుంటే ఎందుకో నచేది కాదు. ఎలా ఒక సంవత్సరము అయిపొయింది. ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా నా ఇంటర్ బుక్స్ కనబడ్డాయి. అప్పుడు గుర్తుకు వచ్చింది "ఇంతి" అనే పదం ఇంక అదే నా కలం పేరుగా పెట్టేసుకున్నాను.

నా డిగ్రీ అయిపొయింది, తరువాత మల్టిమీడియా కోర్సు చేశాను, ఇప్పుడు నాకు ఒక ప్రత్యేకమయిన మెయిల్ ID కావలి, అది ఎలా వుండాలి అంటే నాలాంటి ID ఇంక ఎవ్వరికి వుండకూడదు అని. కద మల్లి ముందుకు వచ్చింది నా కలం పేరులాగా, కాకా పొతే దీనికీ నా కలం పేరు అంత కష్టపడలేదు, నా భాషా పాండిత్యమ అంత వుపయోగించి నా కలం పేరు పక్కనే కలలు అని చేర్చేసాను ఇంగ్లీషులో. ఇప్పుడు నా మెయిల్ ID "inthidreams" అంటే "అమ్మాయి కలలు" అంటే మేము అంత ఉహించుకొని పనిచెయ్యాలి కాబట్టి "inthidreams" పెట్టేసాను.

ఇప్పుడు నా బ్లాగ్ కి అదే పేరు ఉపయోగించుకున్నాను. "అమ్మాయి కలలు" అవి ఎలా వుంటాయో నేను మీకు చెప్పక్కరలేదు ఇది అందరికి తెలిసిందే అందుకే "ఈవి రంగుల మయం గురు" అని ఒక చిన్న తోక తగిలించాను.

నేను ఈ పోస్ట్ రాయడానికి ప్రేరణ ఇచ్చిన "ప్రణీత స్వాతి" గారి కి ఆమె "స్నిగ్ధకౌముది" నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.

ఈ పోస్ట్ చదివిన బ్లాగ్మిత్రులందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు